నలుగురి కోసం.. 180సీట్లున్న విమానం బుక్ చేసిన Businessman

  • Published By: Subhan ,Published On : May 28, 2020 / 02:44 PM IST
నలుగురి కోసం.. 180సీట్లున్న విమానం బుక్ చేసిన Businessman

భోపాల్‌కు చెందిన వ్యాపారవేత్త 180సీట్లు ఉన్న A320 విమానాన్ని కేవలం నలుగురు కోసం బుక్ చేశాడు. కూతురు, ఇద్దరు పిల్లలు, పని మనిషిలు ప్రయాణించేందుకు భారీ ఏర్పాటే చేశాడు. ఢిల్లీ వెళ్లాల్సిన తన కుటుంబాన్ని ఎయిర్‌పోర్టు, విమానాల్లో ప్రయాణించే COVID-19 గుంపు నుంచి కాపాడుకోవడానికి ఇలా చేశాడట. 

ఏవియేషన్ నిపుణుల ప్రకారం.. ఎయిర్‌బస్-320 బుక్ చేసుకోవడానికి రూ.20లక్షలు ఖర్చు అయింది. వేల కొద్దీ వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి, లాక్‌డౌన్‌లో ఇరుక్కుపోయి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నారు. మండుటెండల్లో సైకిల్ తొక్కుకుంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు యాక్సిడెంట్లకు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

లిక్కర్ వ్యాపారవేత్త కుటుంబం లాక్‌డౌన్ కారణంగా 2నెలలుగా భోపాల్ లో ఇరుక్కుపోయింది. ‘A320 అనే ఎయిర్ బస్ 180సీట్ సామర్థ్యంతో మే 25న నలుగురు ప్యాసింజర్లతో ప్రయాణమైంది. ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ లేకపోయినా దానిని బుక్ చేసుకోవడంతో నడిపాం’ అని ఎయిర్‌లైన్ అఫీషియల్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ అన్నారు. 

భోపాల్‌లోని రాజభోజ్ ఎయిర్‌పోర్ట్ డైరక్టర్ అనిల్ విక్రమ్.. ఎటువంటి కామెంట్లు చేయలేదు. ఈ వారం నుంచే దేశీయ ప్రయాణాలు చేసేందుకు డొమెస్టిక్ విమానాలకు అనుమతులు ఇచ్చారు. మార్చి నుంచి అన్ని రకాల విమాన ప్రయాణాలను నిషేదించింది కేంద్రం.