UP’s Hamirpur : ఆ బాధను అనుభవించాను..ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్

ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. యూపీకి చెందిన ఓ వ్యాపరవేత్త కేవలం 01కే ఆక్సిజన్ ను రీఫిల్ చేస్తున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా తెలిసిందే.

UP’s Hamirpur : ఆ బాధను అనుభవించాను..ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్

Up's Hamirpur

Oxygen Cylinders For Just Rs 1 : ఆక్సిజన్, ఆక్సిజన్ ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కరోనా రోగులకు అందించే ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతో మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ తరుణంలో కొంతమంది మానవతా మూర్తులు ముందుకొస్తున్నారు. ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. యూపీకి చెందిన ఓ వ్యాపరవేత్త కేవలం 01కే ఆక్సిజన్ ను రీఫిల్ చేస్తున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా తెలిసిందే.

కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. అందుబాటులో ఉన్న వాటిని కొంతమంది బ్లాక్ మార్కెట్ కు తరలించి రూ. 30 వేలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో హమీర్ పూర్ జిల్లా సుమేర్ పూర్ ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉండే Rimjhim Ispat Factory యజమాని మనోజ్ గుప్తా..కోవిడ్ రోగులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ లలో వేయి ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్ చేసి వందలాది కోవిడ్ రోగులను ప్రాణాలను కాపాడాడు.

భారతదేశంలో కోవిడ్ – 19 యొక్క ఫస్ట్ వేవ్ లో మనోజ్ గుప్తాకు వైరస్ సోకింది. తాను కూడా ఇలాంటి అనుభవం పొందానని, తన ప్లాంట్ లో రోజుకు వేయి ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్ చేసే సామర్థ్యం కలిగి ఉందని మనోజ్ గుప్తా వెల్లడించారు. ఇలాంటి సిలిండర్ లను కేవలం రూ. 1కే విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు RT-PCT రిపోర్టు, వారికి చికిత్స చేస్తున్న వైద్యుడి ధృవీకరణపత్రం, ఆధార్ కార్డు మాత్రం రోగుల తరపు బంధువులు తీసుకరావాల్సి ఉంటుందన్నారు.

ఈ విషయం తెలుసుకున్న కరోనా రోగుల బంధువులు గుప్తా ప్లాంట్ కు క్యూ కడుతున్నారు. ఝాన్సీ, బందా, లలిత్ పూర్, కాన్పూర్, ఇతర జిల్లాలు, లక్నో నుంచి కూడా తరలివస్తున్నారు. ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో గురుద్వారాలో ఆక్సిజన్ సరఫరా కోసం ఆక్సిజన్ లాంగర్ ను ప్రారంభించారు. రోగులకు సహాయపడటానికి హెల్ప్ లైన్ నెంబర్ (9097041313) విడుదల చేశారు.

Read More : First Daughter Born : పుట్టిన ఆడపిల్లను హెలికాప్టర్ లో తీసుకొచ్చారు.. సంబరాలు జరుపుకున్న కుటుంబం