Nitin Gadkari: 2024 నాటికి అమెరికాతో సమానంగా భారత్.. కేంద్ర మంత్రి గడ్కరి

Nitin Gadkari: 2024 ముగిసే నాటికి భారతదేశంలోని రహదారి మౌలిక సదుపాయాలు అమెరికాతో సరిసమానంగా తయారవుతాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. శుక్రవారం దేశ రాజధానిలో నిర్వహించిన 95వ ఎఫ్ఐసీసీఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచ స్థాయి రోడ్లను మనం నిర్మిస్తోన్నాం. 2024 ముగిసే నాటికి మన రహదారి మౌలిక సదుపాయాలు అమెరికాలోని మౌలిక సదుపాయాలతో ఏమాత్రం తీసిపోవు’’ అని అన్నారు.

లాజిస్టిక్స్ ధరల సమస్యను ప్రస్తావిస్తూ “మన లాజిస్టిక్స్ ఖర్చు ప్రస్తుతం పెద్ద సమస్యగా ఉంది. ఇది ప్రస్తుతం 16 శాతంలో ఉంది. అయితే 2024 చివరి నాటికి 9 శాతానికి తీసుకువస్తామని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను” అని గడ్కరి అన్నారు.
ప్రపంచ వనరులలో 40 శాతం వినియోగిస్తున్న నిర్మాణ పరిశ్రమ గురించి మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయాలను అనుసరించడం ద్వారా నిర్మాణ పనులలో స్టీల్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

BJP nationwide protests: నేడు దేశ వ్యాప్తంగా బీజేపీ నిరనస ప్రదర్శనలు

“నిర్మాణ పరిశ్రమ పర్యావరణ కాలుష్యానికి గణనీయంగా దోహదపడటమే కాకుండా 40 శాతం గ్లోబల్ మెటీరియల్స్, వనరులను సంరక్షిస్తుందని మనకు తెలుసు. వనరుల వ్యయాన్ని తగ్గించడం, నిర్మాణ నాణ్యతను మెరుగుపరచడంపై మేము దృష్టి సారిస్తాము. సిమెంట్, స్టీల్ నిర్మాణానికి ప్రధాన భాగాలు, కాబట్టి మేము ప్రత్యామ్నాయాలను అనుసరించడం ద్వారా నిర్మాణ పనులలో ఉక్కు వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము” అని మంత్రి చెప్పారు.

“ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎజెండా 2030ని సాధించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. యూఎన్‭జీసీ, యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ ప్రకారం ప్రపంచ లక్ష్యాల డెలివరీలో 50 శాతం భారతదేశంలో సాధించిన పురోగతి నుంచి వస్తుందని అంచనా. అందువల్ల, స్థిరమైన వృద్ధికి వేదికను సృష్టించడంలో మనమందరం చాలా కీలక పాత్ర పోషిస్తాము” అని గడ్కరీ హర్షం వ్యక్తం చేశారు.

India-China Clash: దేశంలో 3,560 చైనా డైరెక్టర్లు.. చైనాపై రాహుల్ కామెంట్ల అనంతరం కాంగ్రెస్

ట్రెండింగ్ వార్తలు