Bypoll Results 2021 : దేశవ్యాప్తంగా 3 లోక్ సభ,29 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఇవే

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 29 అసెంబ్లీ, 3 లోక్​సభ స్థానాలకు అక్టోబర్​ 30న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-2,2021) వెలువడ్డాయి.

Bypoll Results 2021 : దేశవ్యాప్తంగా 3 లోక్ సభ,29 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఇవే

Bypolls

Bypoll Results 2021  దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 29 అసెంబ్లీ, 3 లోక్​సభ స్థానాలకు అక్టోబర్​ 30న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-2,2021) వెలువడ్డాయి. అయితే అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఆశించినంతగా రాణించలేకపోయింది.

పశ్చిమబెంగాల్– ఉప ఎన్నికలు జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లో(ఖ‌ర్దా, శాంతిపూర్‌, గొసాబ‌, దిన్‌హటా) తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

హిమాచల్ ప్రదేశ్​- మండీ లోక్​సభ సహా, మూడు అసెంబ్లీ స్థానాలకు(జుబ్బల్​-కోట్కాయ్​, ఫతేపుర్, అర్కీ) ఉప ఎన్నికలు జరుగ్గా..అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

కర్ణాటక- రెండు అసెంబ్లీ స్థానాలకు(హంగ‌ల్,సిండ్‌గీ)జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ,విపక్ష కాంగ్రెస్ చెరొక స్థానంలో విజయం సాధించాయి. హంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ విజయం సాధించగా..సిండ్‌గీలో బీజేపీ విజయం సాధించింది. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసిన జేడీఎస్​కు డిపాజిట్ కూడా దక్కలేదు.

రాజస్థాన్‌– ఉపఎన్నికలు జరిగిన ధరియావాడ్‌, వల్లభ్‌నగర్‌ అసెంబ్లీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ విజయం సాధించింది.

బీహార్​– రెండు అసెంబ్లీ స్థానాలకు(కుశేశ్వర్ అస్థాన్​, తారాపుర్) ఉప ఎన్నికలు జరగ్గా.. కుశేశ్వర్ అస్థాన్​లో అధికార జేడీయూ గెలిచింది. తారాపుర్​లో కూడా జేడీయూ స్వల్ప ఆధిక్యంలో ఉంది.

మధ్యప్రదేశ్– మూడు అసెంబ్లీ స్థానాలు(పృథ్వీపుర్, జోబత్,రాయ్​గావ్),ఖండ్వా లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగ్గా..జోబత్,పృథ్వీపుర్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాయ్ గావ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఖండ్వా లోక్ సభ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది.

అసోం-మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు(థోవ్​రా, భవానీపుర్, మరియాని,గోసెన్​ గావ్, తముల్​పుర్​) ఉప ఎన్నికలు జరుగ్గా..థోవ్​రా, భవానీపుర్, మరియానిలో అధికార బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో రెండు స్థానాలు గోసెన్​ గావ్, తముల్​పుర్​లో బీజేపీ మిత్రపక్షం యూడీడీఎప్ అభ్యర్థులు విజయం సాధించారు.

మిజోరం– తూయిరియాల్​ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో అధికార మిజోనేషనల్ ఫ్రంట్ అభ్యర్థి విజయం సాధించారు.

హర్యానా– ఎల్లెనాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఐఎన్ఎల్​డీ(ఇండియన్ నేషనల్ లోక్ దల్) అభ్యర్థి అభయ్ చౌతాలా భాజపా అభ్యర్థి గోబింద్ ఖండాపై 6739 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మేఘాలయ-మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా.. రాజబలలో అధికార ఎన్​పీపీ విజయం సాధించింది. మారింగ్​నెగ్​లో కూడా ఎన్​పీపీ ముందంజలో ఉంది. మాపలాంగ్​లో యూడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్​- బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.

తెలంగాణ– హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు.

కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్​ హవేలీ లోక్​సభ స్థానంలో శివసేన అభ్యర్థి కలాబెన్ దేల్కర్ 51,269ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ALSO READ Rahul Gandhi – Virat Kohli: విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తున్న రాహుల్ గాంధీ