CAA Protest : ఎర్రకోట వద్ద 144 సెక్షన్..భారీగా చేరుకున్న నిరసనకారులు

  • Published By: madhu ,Published On : December 19, 2019 / 07:49 AM IST
CAA Protest : ఎర్రకోట వద్ద 144 సెక్షన్..భారీగా చేరుకున్న నిరసనకారులు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇంకా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు నిరసనలు, ఆందోళనలతో అట్డుడుకుతోంది. భారీగా నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. CAAకి వ్యతిరేకంగా 2019, డిసెంబర్ 19వ తేదీ వామపక్ష నేతృత్వంలోని ఆందోళనకారులు ఎర్రకోట వద్ద భారీ కవాతు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

 

దీనికి పోలీసులు నో చెప్పారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా అక్కడక 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు పోలీసు ఉన్నతాధికారులు. అయినా ఆందోళనకారులు బేఖాతర్ చేశారు. భారీగా కోట వద్దకు చేరుకుంటున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడనే అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వ్యాన్‌లలో ఎక్కిస్తున్నారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. 

 

మరోవైపు పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోకి ఎంట్రీ ఇచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ – గురుగ్రామ్ సరిహద్దులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని 14 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఆయా స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగవని వెల్లడించారు. 

 

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ..ఇతర రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో వామపక్షాలు భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. చార్మినార్ నుంచి ఎగ్జీబీషన్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించాయి. కానీ ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు. తేల్చిచెప్పారు. అయినా బేఖాతర్ చేసి ఎగ్జిబీషన్ గ్రౌండ్ వద్దకు చేరుకుంటున్న వారిని అరెస్టు చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. 144 సెక్షన్ విధించారు పోలీసులు.