Maulana Syed Madani : సీఏఏని కూడా రద్దు చేయాల్సిందే

మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించడాన్ని స్వాగతించిన "జయామిత్ ఉలామా ఏ హింద్" అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ..సీఏఏ

Maulana Syed Madani : సీఏఏని కూడా రద్దు చేయాల్సిందే

Maulana Syed Madani  మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించడాన్ని స్వాగతించిన “జయామిత్ ఉలామా ఏ హింద్” అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ..సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం,2019) చట్టాన్ని కూడా కేంద్రం ఉపసంహరించుకోవాలని శనివారం డిమాండ్ చేశారు.

వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం..ప్రజాసామ్యం మరియు ప్రజల పవరే అత్యంత ముఖ్యమని తెలియజేస్తుందన్నారు. దేశంలోని అన్ని ఆందోళనలను చేసినట్లే రైతుల ఉద్యమాన్ని కూడా అణచివేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారని మదానీ ఆరోపించారు. రైతులను విభజించేందుకు కుట్రలు పన్నారని, అయితే వారు అన్ని రకాల త్యాగాలు చేస్తూనే తమ వైఖరిలో స్థిరంగా ఉన్నారని మదానీ నేతృత్వంలోని జమియత్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలే.. వ్యవసాయ చట్టాలను నిరసించేలా రైతులను ప్రోత్సహించాయని మదానీ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల మాదిరిగానే సీఏఏను కూడా ఉపసంహరించుకోవాలని ఆయన ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.

కాగా,2019 డిసెంబర్ లో పార్లమెంట్ లో సీఏఏ బిల్లు పాస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా కొన్నినెలలపాటు పెద్ద ఎత్తున ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. సీఏఏ ఆందోళనలు యూపీ,ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు దారి తీసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా జరగిన అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలాచోట్ల ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లింది. అయితే సీఏఏ ఆందోళనలు హింసాత్మకంగా మారిన సమయంలో కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించడంతో ఆ తర్వాత ఆందోళనలు ముగిసిన విషయం తెలిసిందే.

ALSO READ Swachh Bharat Awards : ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట