వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసిన వెంటనే సీఏఏ, ఎన్ఆర్సీ అమలు

వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసిన వెంటనే  సీఏఏ, ఎన్ఆర్సీ అమలు

Amit Shah దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ, ఎన్ఆర్సీ అమలు ప్రారంభమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వెస్ట్ బెంగాల్ లోని మతువా కమ్యూనిటీకి కూడా వ్యాక్సినేషన్ ముగిసిన తర్వాత సీఏఏ కింద భారత పౌరసత్వం ఇవ్వనున్నట్లు అమిత్ షా తెలిపారు. సీఏఏ విషయంలో మైనార్టీలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ విపక్షాలపై అమిత్ షా ఫైర్ అయ్యారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో గురువారం అమిత్ షా పర్యటించారు. మతువా కమ్యూనిటీ ప్రాబల్యం కలిగిన కూచ్ బెహర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా..సీఏఏ అన్నది పార్లమెంట్ చేసిన చట్టమని, దాన్ని ఎలా ఆపుతామని ఆయన ప్రశ్నించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విఫలమైనదిగా ఆయన అభివర్ణించారు. ఈ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని మోడీ ‘అభివృధ్ది మోడల్’ కి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘వినాశనకర మోడల్’ కి మధ్య పోరుకు ప్రత్యక్షంగా నిలుస్తాయన్నారు.

మమతా బెనర్జీ కూడా త్వరలో జైశ్రీరామ్ అని నినాదాలు చేసే రోజులు వస్తాయని ఆయన చెప్పారు. కాగా-సీఏఏ, ఎన్ ఆర్ సీ చట్టాలను తాము అమలు చేయబోమని, తన ‘మృతదేహం’ పైనే వీటిని నిర్వహించాలని గతంలో మమత తీవ్రంగా వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. ఈ చట్టాలను ఆమె పలు సందర్బఝాల్లో వ్యతిరేకిస్తూ మాట్లాడారు.

కాగా, అమిత్ షా ప్రస్తావించిన మతువాలు.. ఒరిజనల్ గా తూర్పు పాకిస్తాన్ కు చెందిన బలహీన వర్గమైన హిందువులు.దేశ విభజన మరియు బంగ్లాదేశ్ ఏర్పాటు చేసే సమయంలో వీరు భారత్ కు వలస వచ్చారు. వీరిలో చాలామంది ఇప్పటికే భారత పౌరసత్వాన్ని పొందగా..ఇంకా కొంతమందికి పౌరసత్వం లభించలేదు.