Indian Railways : రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. దీపావళి బోనస్‌గా 78 రోజుల వేతనం

రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది బోనస్‌‌గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

Indian Railways : రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. దీపావళి బోనస్‌గా 78 రోజుల వేతనం

Cabinet Approves Bonus Equal To 78 Days' Wages For Around 11.56 Lakh Railway Employees

78 days wages for Railway employees : రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది బోనస్‌‌గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దాంతో 11.56 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.1985 కోట్ల భారం పడనుంది.

బుధవారం (అక్టోబర్ 6) ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ సహా పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్ ఫియూష్ గోయెల్ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి వివరాలను వెల్లడించారు.
Chandrababu : రెండున్నరేళ్లలో అభివృద్ధి జాడేలేదు,ఏపీలో ఎక్కడ చూసినా విధ్వసం,రాక్షస పాలనే . చంద్రబాబు

దేశవ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్టెక్ట్స్ టైల్ రీజియన్ అండ్ అపెరల్ (PM-Mitra) పార్కుల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ వివరించారు. రాబోయే ఐదేళ్లలో రూ.4,445 కోట్లతో ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీపీపీ పద్ధతిలో పీఎం మిత్ర పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే 10 రాష్ట్రాలు ఈ పార్కుల ఏర్పాటుకు ఆసక్తి చూపించాయని గోయల్ పేర్కొన్నారు.
Forbes 400 List : 25 ఏళ్లలో తొలిసారి..అమెరికా ధనవంతుల జాబితాలో ట్రంప్ కు దక్కని చోటు