మార్చి 1 నుంచి దేశంలో ఫేజ్-2 వ్యాక్సినేషన్

మార్చి 1 నుంచి దేశంలో ఫేజ్-2 వ్యాక్సినేషన్

phase 2 of Covid vaccination దేశంలో 60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి కరోనా టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. భారత టీకా పంపిణీ పురోగతి, కార్యాచరణపై బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం చర్చించింది.

మర్చి -1 నుంచి రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడించారు. దేశ‌వ్యాప్తంగా 10 వేల ప్ర‌భుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేష‌న్ సెంటర్ల‌లో వ్యాక్సిన్ వేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌ని జ‌వ‌దేక‌ర్ చెప్పారు. ప్రైవేటు ఆసుప‌త్రులలో వ్యాక్సిన్ వేసుకోవాల‌ని అనుకునే వాళ్లు డ‌బ్బులు చెల్లించాల‌ని తెలిపారు. దీనికోసం ఎంత డ‌బ్బు చెల్లించాలో వ‌చ్చే మూడు, నాలుగు రోజుల్లో ఆరోగ్య శాఖ నిర్ణ‌యిస్తుంద‌ని తెలిపారు.