Himachal Cabinet Expand: హిమాచల్ ప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం..

తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఏడుగురు ఎమ్మెల్యేలున్న సిమ్లా జిల్లాకు ముగ్గురు మంత్రులు, ఒక ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శితో కేబినెట్‌లో పెద్దపీట వేశారు. బిలాస్‌పూర్ , మండి, లాహోల్, స్పితిలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఇదిలాఉంటే మంత్రివర్గ విస్తరణకు ముందు సీఎం సఖ్విందర్ సింగ్ ఆరుగురు ఎమ్మెల్యేలతో ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయించారు

Himachal Cabinet Expand: హిమాచల్ ప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం..

Himachal pradesh

Himachal Cabinet Expand: హిమాచల్ ప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ జరిగింది. సీఎం సుఖ్విందర్ సింగ్ మంత్రివర్గంలో మంత్రులుగా మరో ఏడుగురు ఎమ్మెల్యేలు చేరారు. ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ధనిరామ్ శాండిల్వ, హర్షవర్దన్ చౌహాన్, జగత్ సింగ్ నేగి, విక్రమాదిత్య సింగ్, చందర్ కుమార్, అనిరుధ్ సింగ్, రోహిత్ ఠాకూర్‌లు ఉన్నారు.

Himachal Pradesh: తన మొదటి జీతాన్ని విద్యార్థులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన హిమాచల్ సీఎం

గతేడాది డిసెంబర్ 11న హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్, ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్ని హోత్రిలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వం కొలువుదీరిన 28 రోజుల తరువాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మంత్రుల సంఖ్య గరిష్టంగా 12మందికి మించకూడదు. ప్రస్తుతం తొమ్మిది మంది మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవితోపాటు మూడు బెర్తులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి.

Himachal Government Formation: హిమాచల్‌ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు

తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఏడుగురు ఎమ్మెల్యేలున్న సిమ్లా జిల్లాకు ముగ్గురు మంత్రులు, ఒక ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శితో కేబినెట్‌లో పెద్దపీట వేశారు. బిలాస్‌పూర్ , మండి, లాహోల్, స్పితిలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఇదిలాఉంటే మంత్రివర్గ విస్తరణకు ముందు సీఎం సఖ్విందర్ సింగ్ ఆరుగురు ఎమ్మెల్యేలతో ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైన ఎమ్మెల్యేల్లో రామ్ కుమార్ చౌదరి, మోహన్ లాల్ బ్రాక్తా, రామ్ కుమార్, ఆశిష్ బుటైల్, కిషోరిలాల్, సంజయ్ అవస్తీ ఉన్నారు. గతేడాది డిసెంబర్ నెలలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్నికలు జరిగాయి. ఇందులో 40 సీట్లు కాంగ్రెస్ గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 25 స్థానాలతో సరిపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ పాత్రకు పరిమితమైంది.