Indian Army: 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కేంద్ర ప్రభుత్వ అద్వర్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ఆమోదం తెలిపింది.

Indian Army: 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Hal

Indian Army: కేంద్ర ప్రభుత్వ అద్వర్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ఆమోదం తెలిపింది. రూ.3,887 కోట్ల వ్యయంతో లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్ (ఎల్ఎస్పీ), రూ.377 కోట్ల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంక్షన్లను కొనుగోలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. హెచ్ఏఎల్ ఫెసిలిటీలో తయారు చేసే 15 హెలికాప్టర్లలో, ఇండియన్ ఎయిర్ఫోర్స్(IAF)కు 10, ఇండియన్ ఆర్మీకి 5 హెలికాప్టర్లు అందించనున్నారు.

Also read:Link Aadhaar Pan : పాన్ కార్డుదారులకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్.. ఆ తర్వాత రూ.1000 ఫైన్..!

ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ కోసం మొత్తం 160 లైట్ కంబాట్ హెలికాప్టర్ల (LCH) తయారీ కోసం 2020లోనే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ప్రతిపాదించింది. వీటిలో 65 హెలికాఫ్టర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలకి వినియోగించనుండగా, మిగిలినవి భారత సైన్యం కోసం వినియోగించ్చనున్నారు. ఈమేరకు మొదటి బ్యాచ్ లో భాగంగా 15 హెలికాప్టర్ల తయారీ నిమిత్తం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా మొదట విడత హెలికాప్టర్ల తయారీపై ఎయిర్ ఫోర్స్, ఆర్మీ నుంచి వచ్చే ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఏఎల్ ఇప్పటికే ఆమేరకు ఉత్పత్తికి కావాల్సిన ప్రణాలికను సిద్ధంచేసినట్లు తెలుస్తుంది.

Also read:PM Modi BIMSTEC: ఈసమయంలో ప్రాంతీయ సహకారం ఎంతో అవసరం: బిమ్స్‌టెక్ సదస్సులో ప్రధాని మోదీ

2020లో భారత సైన్యం మరియు చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల అనంతరం వాస్తవాధీన రేఖ (ఎల్ఏసి) వెంబడి నిఘా నిమిత్తం ఈ హెలికాప్టర్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అత్రి శీతల ఉష్ణోగ్రతలు తట్టుకుని క్లిష్టమైన భూభాగాలలో ఫార్వర్డ్ ప్రదేశాలలో త్వరగా చేరుకునే విధంగా ఈ LCH హెలికాప్టర్లు భారత సైన్యానికి ఎంతో అందివచ్చాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ హెలీకాఫ్టర్లను తయారు చేస్తున్నారు.

Also read:Fianacial Year: ఏప్రిల్ 1నే ఆర్ధిక సంవత్సరం ఎందుకో తెలుసా?