HC Lawyer Arrest : బ్రిక్స్ సదస్సులో సీబీఐ ఆఫీసర్‌లా నటించిన హైకోర్టు లాయర్ అరెస్ట్

హైకోర్టులో అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ న్యాయవాది అయి ఉండి బ్రిక్స్ సదస్సులో పోలీసు అధికారిగా నటించినందుకు కలకత్తా హైకోర్టు అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

HC Lawyer Arrest : బ్రిక్స్ సదస్సులో సీబీఐ ఆఫీసర్‌లా నటించిన హైకోర్టు లాయర్ అరెస్ట్

Calcutta HC lawyer Arrested : హైకోర్టులో అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ న్యాయవాది అయి ఉండి బ్రిక్స్ సదస్సులో పోలీసు అధికారిగా నటించినందుకు కలకత్తా హైకోర్టు అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని మంగళవారం (జులై 6,2021)న కలకత్తా పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో జోహెన్స్ బర్గ్ లో జరిగిన 10వ బిక్స్ సదస్సులో అడ్వకేట్ సనాతన్ రే చౌదరి సీబీఐ అధికారిలా ఫోజులు కొడుతు పలు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు.

అంతేకాదు అడ్వకేట్ చౌదరి సీబీఐ అధికారిగా సంతకం ఫోర్జీరీ చేసి బిక్స్ సదస్సులో పాల్గొన్నారు. అంతేకాదు..గరియాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ల్యాండ్, బిల్డింగ్ కోసం ఇతరులతో కలిసి నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలపై కూడా ఆయన్ని అరెస్ట్ చేశారు. అంతే కాదు సోషల్ మీడియాలో సీబీఐ స్పెషల్ కౌన్సెల్ గా చెప్పుకునేవాడు.

అతను పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఉద్యోగి అని నమ్మించటానికి బ్లూ బెకన్ కారులో తిరిగేవాడు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ గా తననె గుర్తించాలని బ్లూ బెకన్ కారులతో తిరిగేవాడని పోలీసులు గుర్తించారు. ఇటువంటి పలు ఆరోపణలపై హైకోర్టు అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని కోల్ కతా ప్రత్యేక దర్యాప్తు (సిట్) బృందంసనాతన్ రే చౌదరి కేసును విచారిస్తోంది.