Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్ ..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. మంగళవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులకు ఫోన్‌చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు అర్థరాత్రి వేళ ఉరుకులు పరుగులు పెట్టారు.

Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. సోమవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకొనేందుకు అర్థరాత్రి వేళ ఉరుకులు పరుగులు పెట్టారు. చివరకు బెదిరింపు కాల్ చేసింది 38ఏళ్ల వ్యక్తి అని, అతడు మానసిక వికలాంగుడు అని పోలీసులు గుర్తించారు. మానసిక విలాంగుడు కావడంతో సదరు వ్యక్తిని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
నిందితుడి పేరు జై ప్రకాష్ అని, అతని మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు తెలిపారు. బెదిరింపు ఫోన్ కాల్ రాగానే వెంటనే ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేశామని పోలీసులు తెలిపారు. పోలీస్ సిబ్బంది నిమిషాల వ్యవధిలోని జై ప్రకాష్ వద్దకు చేరుకొని అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేశారని, అయితే, అతడు మానసిక వికలాంగుడు కావడంతో అరెస్టు చేయలేదని అన్నారు. క్షణికావేశంలో ఇలా బెదిరింపు కాల్ చేసినట్లు జై ప్రకాష్ తెలిపాడని అన్నారు.