Online Class: ఆన్‌లైన్ క్లాసులకు టవల్‌తో టీచర్… స్టూడెంట్స్ కంప్లైంట్

తమిళనాడులోని ఓ స్కూల్ టీచర్ ఆన్ లైన్ క్లాసులకు టవల్ తో అటెండ్ అయ్యాడు. పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్ స్టూడెంట్స్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ టీచర్ పై ...

Online Class: ఆన్‌లైన్ క్లాసులకు టవల్‌తో టీచర్… స్టూడెంట్స్ కంప్లైంట్

Online Classes

Online Class: తమిళనాడులోని ఓ స్కూల్ టీచర్ ఆన్ లైన్ క్లాసులకు టవల్ తో అటెండ్ అయ్యాడు. పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్ స్టూడెంట్స్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ టీచర్ పై ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న స్టూడెంట్స్ స్కూల్ యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అకౌంటన్సీ అండ్ బిజినెస్ స్టడీస్ క్లాసులు చెప్పే రాజగోపాలన్ అనే వ్యక్తి.. స్టూడెంట్స్ ను తప్పుడు దృష్టితో చూస్తున్నారు. అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. స్కూల్ స్టాఫ్ ఇక్కడ కుల పక్షపాతం కూడా చూపిస్తున్నారంటూ మరికొందరు విమర్శనాత్మక కామెంట్లు చేస్తున్నారు.

నిందితుడైన టీచర్ ను వెంటనే సస్పెండ్ చేసిన స్కూల్ డీన్.. విషయంపై విచారణ జరపాలని ఆదేశించారు. రాజగోపాలన్ అనే వ్యక్తి ఫిజికల్ క్లాసుల్లో బాలికను అసభ్యకరంగా ముట్టుకునేవాడని.. వింత ప్రశ్నలు అడిగే వాడని లైంగికపరమైన కామెంట్లు చేసినట్లు తెలిసింది.

క్లాస్ మొత్తం ముందు ఫిమేల్ స్టూడెంట్స్ శరీరాకృతి గురించి వర్ణిస్తూ మాట్లాడేవాడని.. వాళ్లు మహిళలు స్లీవ్ లెస్ దుస్తులు లేదా అసంప్రదాయ బట్టలు వేసుకోగలరని వెక్కిరించేవాడని తెలిసింది.

అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో టవల్ తో మాత్రమే ఆన్ లైన్ క్లాసులకు హాజరైన రాజగోపాలన్.. స్టూడెంట్లకు వాళ్ల వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్ల గురించి కామెంట్లు చేశాడని తెలిసింది. కొందరి ఫొటోలకు బాగా క్యూట్ గా ఉన్నావని, కొందరికి పిచ్చి కామెంట్లు లాంటివి చేసేవాడని తెలిసింది. ఒక స్టూడెంట్ ను తనతో సినిమాకు రావాలని కూడా అడిగినట్లు స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.

అతని గురించి మేనేజ్మెంట్ కు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదని ఆయన అన్నారు.