చెప్పుతో ఆఫీసర్ ని చావగొట్టిన బీజేపీ టిక్ టాక్ స్టార్

  • Published By: venkaiahnaidu ,Published On : June 5, 2020 / 02:16 PM IST
చెప్పుతో ఆఫీసర్ ని చావగొట్టిన బీజేపీ టిక్ టాక్ స్టార్

టిక్ టాక్ స్టార్ నుంచి బీజేపీ నాయకురాలుగా మారిన సోనాలి ఫోగట్…హర్యాణాలోని ఓ అధికారిని కెమెరా ముందు చెప్పుతో కొట్టింది. తనను కామెంట్ చేశాడని ఆరోపిస్తూ ఓ అధికారిని సోనాలి ఫొగట్ చెప్పుతో కొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
  
గతేడాది భార‌త్ మాతాకీ జై అని నిన‌దించని వారిని పాకిస్తానీయులుగా వ‌ర్ణిస్తూ టిక్‌ టాక్ స్టార్ సోనాలి ఫొగ‌ట్ వార్త‌ల్లోకెక్కిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరి 2019 హర్యాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేసి ఓడిపోయింది. అయితే శుక్రవారం(జూన్-5,2020)సోనాలి ఫొగ‌ట్ బాలాస్మంద్‌ లోని ధాన్యం మార్కెట్‌ను స‌మీక్షించేందుకు వెళ్లింది. ఆ సమయంలో రైతులు ఇచ్చిన కంప్లెయిట్ ల లిస్ట్ ను అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుల్తాన్ సింగ్ కు ఇచ్చేందుకు వెళ్లింది.

ఈ క్ర‌మంలో తనను గురించి అసభ్యకరమైన కామెంట్ చేశాడని ఆరోపిస్తూ సుల్తాన్ సింగ్ ను బూతులు తిడుతూ, చెప్పుతో చావగొట్టింది సోనాలి. చెప్పు తీసుకుని ఆ అధికారిని ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా కొట్టింది. దీనికి సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మీ కంప్లెంట్ లను గుర్తించాను,వాటిని పరిష్కరిస్తాను అంటూ చెప్పుతో కొడుతున్న సోనాలిని ఆ అధికారి వేడుకుంటున్న ఆ వీడియోలో కనిపిస్తోంది.

దీనిపై సొనాలి మాట్లాడుతూ అత‌ను దుర్భాష‌లాడుతూ, త‌న‌ను అవ‌మానించ‌డం వ‌ల్లే కొట్టాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. అయితే అధికారి సుల్తాన్ మాత్రం తానేమీ అన‌క‌ముందే సోనాలి త‌న‌పై దాడి చేసింద‌ని చెప్పుకొచ్చాడు. అయితే అధికారి క్షమాపణతో సోనాలి ఆయనపై ఎలాంటి పోలీస్ కేసు పెట్టలేదు. మరోవైపు సోనాలి ఫొగట్ పై చర్యలు తీసుకోవాలని హర్యాణా సీఎంను కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా కోరారు. ఖట్టర్ ప్రభుత్వం వికారమైన పనులు చేస్తోందని, మార్కెట్ కమిటీ సెక్రటరీని ఓ జంతువులాగా సోనాలి కొట్టిందని,ప్రభుత్వ ఉద్యోగిగా ఉండటం నేరమా అని రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.