West Bengal : వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు, ప్రచారానికి ఎండ్ కార్డు

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి 2021, మార్చి 25వ తేదీ గురువారంతో తెరపడనుంది.

West Bengal : వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు, ప్రచారానికి ఎండ్ కార్డు

West Bengal

Campaigning for first phase : పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి 2021, మార్చి 25వ తేదీ గురువారంతో తెరపడనుంది. మార్చ్ 27న జరగనున్న మొదటి దశ పోలింగ్‌కు ప్రచారం సాయంత్రంతో ముగిసింది. బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 68 సీట్లు ఎస్సీ, 16 సీట్లు ఎస్టీకి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఎనిమిది దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటింగ్ మార్చ్ 27న మొదలై ఏప్రిల్ 29న ముగుస్తుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మొదటి దశ పోలింగ్ మార్చ్ 27న జరగనుంది. సాయంత్రంతో ఫస్ట్ ఫేస్ ప్రచారం ముగుస్తుంది. దీంతో 30 నియోజకవర్గాల్లో మైకులు మూగబోయాయి.

బెంగాల్‌లో ఐదు జిల్లాల్లో 30 శాసన సభ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది. పశ్చిమ మిడ్నాపూర్, తూర్పు మిడ్నాపూర్, బంకురా, జార్‌గ్రామ్‌, పురులియా జిల్లాల్లో ఫస్ట్‌ ఫేస్ పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశ పోలింగ్‌కు ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగుస్తున్నందున పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొంటారు. జాయ్‌పూర్‌, తాల్‌డాగ్రా, కాక్‌ద్వీప్, నియోజకవర్గాల్లో రాజ్ నాథ్ ర్యాలీ కొనసాగనుంది. ఇక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం నిర్వహించనున్నారు. మమత బెనర్జీ కూడా ముమ్మర ప్రచారం చేయనున్నారు.

ఐదు జిల్లాల్లో 2016లో టీఎంసీ భారీగా సీట్లు కైవసం చేసుకుంది. 30 సీట్లలో మొత్తం 27 టీఎంసీ గెలుచుకోగా… కాంగ్రెస్ రెండు సీట్లు, ఆర్‌ఎస్పీ ఒక స్థానంలో గెలుపొందింది. అయితే ఈ సారి కూడా 27 సీట్లు దక్కించుకోవాలని టీఎంసీ వ్యూహం రచించింది. మొత్తం 191 అభ్యర్థులు బరిలో ఉన్న 30 స్థానాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక 42 మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. ఇక 19 మంది ధనవంతులు ఎన్నికల బరిలో ఉన్నారు.