Campus Placements : కలలు కల్లలు.. తీవ్ర నిరాశలో విద్యార్థులు, భారీగా తగ్గిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. ఎందుకిలా?

ఇప్పుడు ఐటీ రంగానికి కష్టకాలం నడుస్తోంది. ప్రముఖ కంపెనీలు లేఆఫ్ లతో ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. ఈ ప్రభావం క్యాంపస్ సెలెక్షన్స్ పైనా పడింది. 2022తో పోలిస్తే 2023లో క్యాంపస్ సెలెక్షన్స్ పెద్దగా జరగడం లేదు.

Campus Placements : కలలు కల్లలు.. తీవ్ర నిరాశలో విద్యార్థులు, భారీగా తగ్గిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. ఎందుకిలా?

Campus Placements : క్యాంపస్ సెలెక్షన్స్.. ఇంజినీరింగ్, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా వీటి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యి.. డిగ్రీ, పీజీ పట్టా రాకముందే అపాయింట్ మెంట్ ఆర్డర్లు తీసుకోవాలని కలలు కంటారు. కరోనా సమయంలో ఆ తర్వాత ఐటీ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు లభించాయి. 2022 అయితే క్యాంపస్ సెలక్షన్స్ కు గోల్డెన్ ఈయర్ గా నిలిచింది. ఎంతోమంది విద్యార్థులు క్యాంపస్ సెలెక్షన్స్ తో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా మారారు.

Also Read..PAN-Aadhaar Link : మీ ఆధార్- పాన్ కార్డు ఇంకా లింక్ చేయలేదా? ఈ తేదీలోగా SMS ద్వారా వెంటనే లింక్ చేయండి.. ఇదిగో ప్రాసెస్..!

కానీ, ఇప్పుడు ఐటీ రంగానికి కష్టకాలం నడుస్తోంది. ప్రముఖ కంపెనీలు లేఆఫ్ లతో ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. ఈ ప్రభావం క్యాంపస్ సెలెక్షన్స్ పైనా పడింది. 2022తో పోలిస్తే 2023లో క్యాంపస్ సెలెక్షన్స్ పెద్దగా జరగడం లేదు. చెప్పాలంటే 2022తో పోలిస్తే 2023లో సగానికిపైగా క్యాంపస్ ప్లేస్ మెంట్స్ తగ్గిపోయాయి. విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు అయితే ఇంతవరకు క్యాంపస్ సెలెక్షన్స్ మొదలుపెట్టలేదు. గతేడాది భారీగా రిక్రూట్ మెంట్లు చేసుకోవడం కూడా ఇప్పటి నియామకాల ఎంపిక ఆలస్యానికి కారణంగా భావిస్తున్నారు.

Also Read..Zomato : జొమాటో షాకింగ్ డెసిషన్.. సేవలు పూర్తిగా బంద్

ఆగస్టు, సెప్టెంబర్ లో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ సీజన్ మొదలవుతుంది. ఇన్ఫోసిస్ వంటి సంస్థలు నవంబర్, డిసెంబర్ లో క్యాంపస్ సెలక్షన్స్ కు వస్తాయి. కానీ, ఫిబ్రవరిలో సగం రోజులు గడిచిపోతున్నా ఇంతవరకు ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు మొదలు పెట్టలేదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కంపెనీల తీరుతో ఈ ఏడాది డిగ్రీ, పీజీ చేస్తున్న విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. 2022లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన బ్యాచ్ ల నుంచి భారీగా రిక్రూట్ మెంట్లు చేసుకున్న కంపెనీలు వారినే ఇంకా పూర్తి స్థాయిలో విధుల్లోకి తీసుకోలేదు. ఇక 2023 బ్యాచ్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. 2021 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 40వేల మందిని రిక్రూట్ చేసుకుంటే, ఇన్ఫోసిస్ 21వేల మందిని, హెచ్ సీఎల్ 10వేల నుంచి 12వేల మందిని, విప్రో 9వేల మందిని నియమించుకుంది.

2022లో క్యాంపస్ సెలెక్షన్స్ భారీగా ఉన్నాయి. టీసీఎస్ లక్షా 10వేల మందిని, ఇన్ఫోసిస్ 85వేల మందిని, హెచ్ సీఎల్ 23వేల మందిని, విప్రో 17వేల మందిని రిక్రూట్ చేసుకున్నాయి. 2022తో పోలిస్తే 2023లో నియామకాల సంఖ్య భారీగా పడిపోయింది. టీసీఎస్ 42వేల మందిని, ఇన్ఫోసిస్ 46వేల మందిని, హెచ్ సీఎల్ 22వేల మందిని, విప్రో 17వేల మందిని నియమించుకున్నాయి.

నిజానికి కరోనా సమయంలో అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి. కానీ, ఐటీ రంగంపై మాత్రం కరోనా ప్రభావం పడలేదు. పైగా, ఐటీ ఉద్యోగులు, సంస్థలు అధిక మొత్తంలో లాభపడ్డారు. మహమ్మారిని తట్టుకుని నిలిచిన రంగం కరోనా పరిస్థితుల తర్వాత మాత్రం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.

అమెజాన్, గూగుల్, ట్విట్టర్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని కంపెనీలు అదే బాటలో సాగుతున్నాయి. దీంతో ఐటీ రంగంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియక ఐటీ నిపుణులు భయం, ఆందోళనతో రోజులు వెళ్లదీస్తున్నారు. ప్రపంచం ఆర్థిక సంక్షోభం అంచున ఉందన్న అంచనాలతో కంపెనీలు ఖర్చు తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఉన్న వారినే తీసేస్తున్న సంస్థలు కొత్త నియామకాల జోలికే వెళ్లడం లేదు.