Mamata Banerjee: నందిగ్రామ్‌లో ఓడినా మమతా సీఎం అవగలరా?

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మమతా బెనర్జీకి ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ దక్కించుకున్నప్పటికీ ...

Mamata Banerjee: నందిగ్రామ్‌లో ఓడినా మమతా సీఎం అవగలరా?

Mamata Benerjee

Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మమతా బెనర్జీకి ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ దక్కించుకున్నప్పటికీ సొంతగా పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలోనే ఓడిపోయింది. మాజీ మంత్రి సువెందు అధికారి చేతిలో ఓటమి ఎదుర్కొంది. ఇప్పుడు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే.. టీఎంసీ అధికారంలోకి వచ్చాక వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీనే అవుతారా అని…

నేరుగా చెప్పాలంటే ఆమె సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 164(4) ప్రకారం.. ఓ ఆరు నెలల కాలం పాటు శాసనసభ సభ్యత్వం లేకపోయినా మినిస్ట్రీగా కొనసాగొచ్చు.

మమతా ఓ ఆరు నెలల కాలంలో బై ఎలక్షన్ ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవొచ్చు. ఒకవేళ అలా గెలవడంలో ఫెయిల్ అయితే సీఎంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో గెలిచి సీఎం పదవిని అధిష్టించారు.

2011లో మమతా లోక్ సభ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో తమ టీఎంసీ అధికారంలోకి వచ్చింది అప్పుడే. ఆ తర్వాత సీఎం అయి బైఎలక్షన్ ద్వారా భవానీపూర్ నియోజకవర్గం నుంచి అదే సంవత్సరం సెప్టెంబర్ లో గెలుపొందింది. కొన్ని రాష్ట్రాల్లో శాసన మండలి నుంచి కూడా ఎమ్మెల్సీగా ఎన్నికై సీఎం అయ్యారు.

2017లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్సీగా గెలుపొంది.. ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనే లేదు. శాసనమండలి లేకపోయినప్పటికీ మమతా అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా సీఎం అవ్వొచ్చు.

ఒకవేళ ఉప ఎన్నికల్లో సీఎం ఓడిపోతే..
2009లో జార్ఖండ్ సీఎం ఉప ఎన్నికల్లో తమర్ నుంచి పోటీ చేసి ఓడిపోతే రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ అమల్లోకి వచ్చింది. కాకపోతే అది చాలా అరుదు.