Viral video: బాబోయ్.. వీడియోలో ఉంది మనిషా? యంత్రమా?.. తేడా వస్తే చేయి తెగిపడినట్లే.. మీరూ ట్రై చేస్తారా?

మీరెప్పుడైనా క్యాబేజీపై ఆకును తొలగించడం చూశారా.. ఎక్కువగా క్యాబేజీ పంటను సాగు చేసే రైతులు ఈ పనులు చేస్తుంటారు. అయితే పంటసాగు చేసిన రైతులు అయినా క్యాబేజీపై ఆకును తీసేయాలంటే కొంత సమయం పడుతుంది...

Viral video: బాబోయ్.. వీడియోలో ఉంది మనిషా? యంత్రమా?.. తేడా వస్తే చేయి తెగిపడినట్లే.. మీరూ ట్రై చేస్తారా?

Cabbage

Viral video: మీరెప్పుడైనా క్యాబేజీపై ఆకును తొలగించడం చూశారా.. ఎక్కువగా క్యాబేజీ పంటను సాగు చేసే రైతులు ఈ పనులు చేస్తుంటారు. అయితే పంటసాగు చేసిన రైతులు అయినా క్యాబేజీపై ఆకును తీసేయాలంటే కొంత సమయం పడుతుంది. నెమ్మదిగా తొలగిస్తారు. కానీ కొందరు మిషన్ల సాయంతోనూ తొలగిస్తారు. ఇక్కడ వీడియోలో ఓ వ్యక్తి మాత్రం క్యాబేజీ ఆకులను మిషన్ కత్తిరించినట్లే కత్తిరిచ్చేస్తున్నాడు. రైతు సాగు చేసిన పంట చేతికొచ్చిన తరువాత క్యాబేజీ ఆకులను తొలగించి బస్తాల్లో భద్రపరుస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న వ్యక్తి మరో వ్యక్తికి క్యాబేజీలను విసురుతుండగా వాటిని పట్టుకొని యంత్రంలా జెట్ స్పీడ్ తో కత్తిరించేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రక్రియలో కత్తి కొద్దిగా అటూఇటు అయినా చేయి తెగిపోవటం ఖాయం. ఇంతటి సాహసోపేతమైన చర్యలను అతను అవలీలగా చేస్తుండటం చూసిన ఎరిక్ సోల్హీమ్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ఎవ్వరైనా కనురెప్పలు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయతారు.

గ్రీన్ బెల్ట్, రోడ్ ఇన్సిట్యూట్ అధ్యక్షుడు ఎరిక్ సోల్హీమ్ ఈ వీడియోను తన ట్విటర్ లో ఈనెల 16న పోస్టు చేశాడు. పోస్టు చేసిన మూడు రోజుల్లో లక్షన్నర మందికిపైగా ఈ వీడియోను వీక్షించి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఎరిక్ సోల్హీమ్ ఈ వీడియోకు ‘అందుకే దీన్ని ఇండియా అన్నారు.. ఇక్కడ రోబోటిక్ ఆటోమేషన్’ అవసరం లేదంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇలా చేయడం నేను ఎక్కడా చూడలేదని, ఇతర దేశాల్లో అయితే వీటికోసం యంత్రాలను ఉపయోగిస్తారని, కానీ ఇండియాలో ఇలాంటి వ్యక్తులు ఉండటంతో ఇకపై రోబో ఆటోమేటిక్ అవసరం లేదన్న విధంగా అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ అయ్యబాబోయ్.. ఇదేంటి.. అతను రోబోనా? మనిషా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం జాతీయ జెండాను ఉంచి ఇది ఇండియా అంటే అంటూ రీ ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు, ఇండియాలో ఏ ప్రాంతంలో ఈ వీడియోను తీశారనేదానిపై స్పష్టం లేదు.