నరమాంస భక్షకుడి కలకలం : భయాందోళనలో ప్రజలు 

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 09:05 AM IST
నరమాంస భక్షకుడి కలకలం : భయాందోళనలో ప్రజలు 

వసుదేవనల్లూర్  : తమిళనాడులో నరమాంస భక్షుకుడికి కలకలంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆదిమానవుల కాలంలో కొన్ని జాతుల వారు మనిషి మాసం తిని బతికే వారని..కొంత కాలం తర్వాత అలాంటి జాతులు అంతరించి పోయాయని విన్నాం. కానీ అటువంటి దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుంది. పై ప్రాణాలు పైనే పోతాయి కదూ..సరిగ్గా అటువంటి సంఘటనకే గురయ్యారు తమిళనాడులోని ఓ గ్రామస్థులు.  
 

శ్మశానంలో సగం కాలిన శవాలను పీక్కు తింటున్న ఓ వ్యక్తిని చూసిన గ్రామస్థులు హడలిపోతున్నారు. రాష్ట్రంలోని తిరునెవ్వేలి జిల్లా టి.రామనాథపురం గ్రామంలో శనివారం (ఫిబ్రవరి2)న ఓ మహిళ మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు గ్రామ శివారులోని శ్మశానంలో అంత్యక్రియలు జరిపి అందరూ తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. అదేరోజు రాత్రి 1.30 గంటల సమయంలో కొందరు గ్రామస్థులు ఆ మార్గంలో వెళుతుండగా శ్మశానం నుంచి ఏవో శబ్ధాలు వినిపించంతో వారు శ్మశానంలోకి చూడగా ఓ వ్యక్తి సగం కాలిన శవాన్ని పీక్కు తింటున్నట్లు గమనించి షాకయ్యారు. అనంతరం భయంతో కేకలు వేశారు. బిలబిలా మంటు వచ్చిన స్థానికులు అతడిని తరిమి కొట్టేందుకు రాళ్లు రువ్వారు. అయినా అతనిలో ఏమాత్రం కదలికి లేదు..చేసే పని ఆపనూ లేదు. 
 

దీంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్థులు వసుదేవనల్లూర్ పోలీసులకు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  తరువాత సదరు వ్యక్తిని గుర్తించిన స్థానికులు టి.రామనాథపురానికి చెందిన మురుగేశన్ అని చెప్పారు.   కూలి పనులకు వెళ్లే మురుగేశన్ చెడు అలవాట్లతో డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యను రకరకాల వేధింపులకు గురిచేసేవారు. దీంతో భార్య అతడిని వదిలిపెట్టి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంక పట్టించుకునే వారు లేక చివరకు ఇలా తయారయ్యాడనీ రామనాథపురం గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. 

పోలీసుల విచారణలో భాగంగా అతడి తీరుపై అనుమానించిన పోలీసులు అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మానసిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్లు వసుదేవనల్లూర్ ఇన్స్‌పెక్టర్ ఆంటోనీ తెలిపారు. అయితే మురుగేశన్ ఆకలితోనే శవాన్ని పీక్కు తిన్నాడా? లేక నరమాంస భక్షకుడిగా మారాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ ఆంటోని తెలిపారు.