Covid Victims: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఇవ్వలేం – కేంద్రం

కొవిడ్ మృతుల కుటుంబాలకు నష్ట పరిహారంగా రూ.4లక్షలు ఇవ్వలేమని చెప్తుంది కేంద్రం. కొవిడ్-19 కారణంగా నష్టపోయిన వారికి కనీస సహాయం కింద ఎక్స్‌గ్రేషియా అమౌంట్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిల్ కు కేంద్రం ఇలా రెస్పాన్స్ ఇచ్చింది.

Covid Victims: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఇవ్వలేం – కేంద్రం

Covid Victims

Covid Victims: కొవిడ్ మృతుల కుటుంబాలకు నష్ట పరిహారంగా రూ.4లక్షలు ఇవ్వలేమని చెప్తుంది కేంద్రం. కొవిడ్-19 కారణంగా నష్టపోయిన వారికి కనీస సహాయం కింద ఎక్స్‌గ్రేషియా అమౌంట్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిల్ కు కేంద్రం ఇలా రెస్పాన్స్ ఇచ్చింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం.. నష్ట పరిహారాన్ని చెల్లించలేమని అది కేవలం ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తేనో లేదా వరదలు లాంటివి వస్తేనో ఇవ్వగలమని చెప్పింది.

దాదాపు మహమ్మారి కారణంగా చనిపోయిన వారు 4లక్షల మంది ఉన్నారని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ‘ఎక్స్‌గ్రేషియా అమౌంట్ నష్టపోయిన ప్రతి కుటుంబానికి అందించడానికి ప్రయత్నించగలం. ఒకవేళ అలా ఎక్స్‌గ్రేషియా అమౌంట్ SDRF నిధుల నుంచి కేటాయిస్తే మున్ముందు కొవిడ్-19 అవసరాల కోసం నిధులు లేకుండాపోతాయి.

సైక్లోన్, వరదలు వంటివి వస్తే మెడికల్‌తో పాటు ఇతర సదుపాయాలు కోసం నిధులు కావాల్సి ఉంటుంది. అలా కొవిడ్ మృతుల కుటుంబానికి రూ.4లక్షల నష్టపరిహారం చెల్లించడమనేది రాష్ట్ర ప్రభుత్వాలకు శక్తికి మించిన భారం అవుతుంది’ అని కేంద్రం చెప్పింది.