Punjab : సాక్సులు అమ్ముతున్న బాలుడు..చలించిన సీఎం

లుథియానాలో వంశ్ సింగ్ అనే బాలుడు రోడ్డు మీద సాక్సులు విక్రయిస్తున్నాడు. కుటుంబం పేదరికంలో ఉండండంతో కుటుంబపోషణ కోసం సాక్సులు విక్రయిస్తున్నాడు.

Punjab : సాక్సులు అమ్ముతున్న బాలుడు..చలించిన సీఎం

Punjab

Selling Socks : ఓ పదేళ్ల బాలుడు..రోడ్డు మీద సాక్సులు అమ్ముతున్నాడు. అతని వద్ద కొనుక్కొని వెళుతున్నారే కానీ..చదువుకోవాల్సిన వయస్సులో ఇలా ఎందుకు చేస్తున్నావంటూ ఒక్కరు ప్రశ్నించలేదు. కానీ..ఓ వ్యక్తి అతను అమ్ముతుండగా..వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయం సీఎం సార్ వద్దకు తెలిసింది. వెంటనే స్పందించారు. ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

లుథియానాలో వంశ్ సింగ్ అనే బాలుడు రోడ్డు మీద సాక్సులు విక్రయిస్తున్నాడు. కుటుంబం పేదరికంలో ఉండండంతో కుటుంబపోషణ కోసం సాక్సులు విక్రయిస్తున్నాడు. స్కూల్ మధ్యలోనే ఆపివేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చూసి సీఎం అమరీందర్ సింగ్ చలించిపోయారు.

వెంటనే ఆ బాలుడి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వంశ్ సింగ్ వెంటనే స్కూల్లో చేరేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. అంతకముందు బాలుడు వంశ్ సింగ్ తో సీఎం అమరీందర్ మాట్లాడారు. అతడి కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్నారు. వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తనదని స్పష్టం చేశారు. వంశ్ సింగ్ ను చదివించాలని, అందుకయ్యే ఏర్పాట్లు ప్రభుత్వమే చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.

Read More : Happy Hypoxia: కరోనా కారణంగా యువతే ఎక్కువగా నష్టపోవడానికి కారణం