కుర్రాళ్ల మాజాకా :  బైక్ ని కారుగా మార్చేశారు 

  • Published By: vamsi ,Published On : November 2, 2019 / 08:34 AM IST
కుర్రాళ్ల మాజాకా :  బైక్ ని కారుగా మార్చేశారు 

కుర్రాళ్లంటే సినిమాలు..షికార్లు..అమ్మాయిలు..చాటింగ్ లు అని అనుకుంటాం. కానీ వారు  తలచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్లు. బైకుని కారులా మార్చేశారు. ఈ కారు..అదేనండీ బైకుని వెనుకనుండి చూస్తే బైక్ లా..ముందు నుంచి చూస్తే కారులా ఉంటుంది. కారులో కూర్చున్నట్లుగానే ఈ ఇద్దరు యువకులు పక్క పక్కన కూర్చుని ఈ ఇద్దరు కుర్రాళ్లూ రోడ్డుపై దూసుకుపోతున్నారు. ఈ బైక్ కారుని చూసినవారంతా తిరిగి చూడకుండా ఉండలేకపోతున్నారు. 

పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఈ కుర్రాళ్లు తమ టాలెంట్ కు పదును పెట్టారు. కారు బైక్ ను తయారు చేశారు. బైకును కారులా మార్చేసిన ఈ కుర్రాళ్లు రోడ్లపై దూసుకుపోతూ..చూసినవారందరినీ  ఆశ్చర్యపరస్తున్నారు. బైక్ హ్యాండిల్‌ని స్టీరింగ్‌లాగా మార్చేశారు. అచ్చంగా కారులోనే బ్రేకులు, ఎస్కలేటర్, గేర్లు సెట్ చేశారు. 
@desimojito అనే ట్విట్టర్ యూజర్ పోస్టు వైరల్ గా మారింది. ఈ బైక్ కారు వీడియోను చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు.

ఈ ఇద్దరు కుర్రాళ్ల టాలెంట్ పై ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారులో సగం భాగం మాత్రమే పూర్తయ్యింది. ఇంకా బ్యాక్ సైండ్..టాప్ కూడా  తయారు చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ కారును పూర్తి చేస్తామంటున్నారు కుర్రాళ్లు.. మరి మీరు కూడా ఈ బైక్ కారుని మీరు కూడా చూడండీ..