పబ్లిక్ చార్జింగ్ తో కేర్ ఫుల్ : పిండేస్తారు డాటా..

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 04:47 AM IST
పబ్లిక్ చార్జింగ్ తో కేర్ ఫుల్ : పిండేస్తారు డాటా..

హైదరాబాద్ : అన్నింటికి ఫోన్స్ మీదనే ఆధారపడిపోవటం కామన్ గా మారిపోయింది. దీంతో ఫోన్ లో చార్జింగ్ అయిపోతే..ఆ సమయంలో బైట ఉంటే ఏం చేస్తాం? పబ్లిక్ చార్జింగ్ మీదనే ఆధారపడతాం. కానీ దీని వల్ల కూడా  ఎన్నో సమస్యలు వస్తాయని తెలిసింది. ఎయిర్‌పోర్టులు, రైల్వే, బస్‌ స్టేషన్లతోపాటు చాలా షాపింగ్‌ మాల్స్ లలో స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్‌ స్టేషన్లు వుంటాయి. ఏమాత్రం ఆలోచించకుండా చార్జింగ్ చేసేసుకుంటాం. కానీ ఇక్కడే వుంది అసలు సమస్య అంతా.. అంతేకాదు పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసుకుని వాడుకున్నా సమస్యలు తప్పవట..

పబ్లిక్‌ వైఫైలు వాడితే ఇబ్బంది ఉంటుందని చాలాకాలంగా వింటున్నాంగానీ..కానీ పబ్లిక్ చార్జింగ్ చేసుకుంటే హ్యాకర్లు మన మొబైల్ డాటాపై దాడి చేస్తారు తస్మాత్ జాగ్రత్త..పబ్లిక్ చార్జింగ్ లలో యూఎస్‌బీ పోర్ట్‌లను మార్చేసే టెక్నిక్ పై హ్యాకర్స్ కన్ను పడింది. ఇది తెలియిన పబ్లిక్ చార్జింగ్ తో ల్యాప్‌టాప్‌/ఫోన్‌లను కనెక్ట్‌ చేస్తే..చార్జ్‌ అవటంతో పాటు చార్జింగ్ యూఎస్‌బీ పోర్టులోని డాటాను చోరీ చేసేందుకు..స్టోర్‌ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఈ పోర్ట్ ద్వారానే జరిగిపోతుంది.ఈ మాల్‌వేర్‌ ద్వారా డేటాను లాక్‌ చేసేయవచ్చు..లేదా ఆ డేటాను ఓపెన్‌ చేయాలంటే వారు ఏరూపంలోనైనా  డిమాండ్‌ చేస్తారు.లేదా..మన బ్యాంక్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయి (పాస్‌వర్డ్, యూజర్‌నేమ్‌ వంటివి మీరు గాడ్జెట్‌లో స్టోర్‌ చేసుకుని ఉంటే) మీ డబ్బుల్ని మొత్తాన్ని చిటికెలో కొట్టేయవచ్చు. దీన్నే జ్యూస్‌ జాకింగ్‌ అంటారు. 

సైబర్ వరల్డ్ లో జ్యూస్ జాకింగ్ ..
సైబర్‌ వరల్డ్ లో జ్యూస్‌ జాకింగ్‌ పేరు ఇటీవలే అయినా..2011లోనే కొంతమంది టెకీలు హ్యాక్ చేసిన సందర్భాలు వున్నాయి. ఈ విషయం ఇంటర్నేషనల్ హ్యాకర్ల మీటింగ్ డెఫ్‌కాన్‌లో తెలిసింది. పబ్లిక్ గా గాడ్జెట్‌ చార్జింగ్‌ జరగనప్పుడు ఆయా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్‌ ద్వారా కూడా ఎల్‌సీడీ స్క్రీన్ పై ఉచిత చార్జింగ్‌ ప్లేస్ అనే పేరుతో స్మార్ట్‌ఫోన్‌/ల్యాప్‌టాప్‌ చార్జింగ్ పెట్టగానే..డేటాను హ్యాక్ చేసే మాల్‌వేర్‌ను కనెక్ట్ చేసేస్తారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అందుకే ఎక్కడపడితే అక్కడ చార్జింగ్‌ చేసుకోకుండా వీలైనంత వరకూ  ఫోన్‌/ల్యాప్‌టాప్‌ ఇంట్లోనే ఫుల్‌గా చార్జ్‌ చేసుకోవాలి. లేదా ఫుల్ చార్జింగ్ వున్న బ్యాటరీ ఎక్స్‌ట్రా పట్టుకెళ్లడం స్మార్ట్‌ఫోన్‌ విషయానికొస్తే మంచి పవర్‌బ్యాంక్‌ పెట్టుకోవటం..చార్జింగ్‌ స్టేషన్లలోని యూఎస్‌బీ పోర్టులను ఉపయోగించకుండా.. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌ ప్లగ్‌ల ద్వారా మీదైన చార్జర్‌తో ఫోన్‌/ల్యాప్‌టాప్‌ చార్జ్‌ చేసుకోండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్‌ యూఎస్‌బీ పోర్టు ద్వారానే చార్జ్‌ చేసుకోవాల్సి వస్తే.. మీ గాడ్జెట్‌ను ఆఫ్‌ చేసేయండి. దీంతో కూడా డేటా ట్రాన్స్‌ఫర్‌ జరగదు కాబట్టి ఎవరూ మీ గాడ్జెట్‌లోకి మాల్‌వేర్‌ను వేయడంగానీ.. డాటాను హ్యాక్ చేయటంగాని జరగదు..మరి ఈ జాగ్రత్తలు తీసుకోండి..మీ మీ డాటాను భధ్రపరుచుకోండి..లేదంటే చార్జింగ్ తో పాటు మీ జేబులు..బ్యాంక్ ఎకౌంట్స్ అన్నీ ఖాళీ అయిపోవటం ఖాయం..