నివార్ తుఫాన్ ముందస్తు జాగ్రత్తలు : వంతెనలపై వాహనాల పార్కింగ్

  • Published By: madhu ,Published On : November 26, 2020 / 12:39 PM IST
నివార్ తుఫాన్ ముందస్తు జాగ్రత్తలు : వంతెనలపై వాహనాల పార్కింగ్

Cars Parked On Chennai Flyover : నివార్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసేస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. 2015లో వచ్చిన వరదలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆ సంవత్సరంలో వచ్చిన వరదల వల్ల భారీ నష్టమే వాటిల్లింది. వాహనాలు నీటిలో కొట్టుకపోయాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి బీభత్సంగా ఉండేది. మళ్లీ అలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు..తమిళనాడు రాష్ట్రంలోని మడిపక్కం నివాసితులు తమ తమ వాహనాలను వెలాచేరి సమీపంలీోని మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం రైల్వే స్టేషన్ కు ఎదురుగా ఉన్న వంతెనపై నిలిపారు.



కార్లను ఒకదాని తర్వాత ఒకటి పార్క్ చేశారు. దీంతో వంతెన ఇరువైపులా కార్లతో నిండిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నివార్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెట్లు నేల కొరుగుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం మీదుగా పశ్చిమ ఉత్తరం వైపుకు వెళుతూ..చాలా తీవ్రమైన తుఫాన్ గా మారిపోయింది. నగరానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ వెల్లడించారు.



https://10tv.in/five-single-screen-theatres-have-closed-permanently-in-hyderabad/
2015లో వచ్చిన వరదలకు మడిపక్కం, కొట్టూర్పురం ప్రాంతాల్లోని అనేక కార్లు మునిగిపోయాయి. నగరంలో ఉన్న మొత్తం 22 సబ్ వేలు నీటితో ఉండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.