Tamil Nadu CM: తమిళనాడు సీఎం స్టాలిన్‌‌ను బురిడీకొట్టించిన దివ్యాంగుడు.. కేసు నమోదు చేసిన పోలీసులు

దివ్యాంగుడి మాటలు నమ్మి ఛత్రకుడికి చెందిన ఓ బేకరీ యాజమాని ఏకంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కూడాచేసినట్లు పోలీసులు గుర్తించారు.

Tamil Nadu CM: తమిళనాడు సీఎం స్టాలిన్‌‌ను బురిడీకొట్టించిన దివ్యాంగుడు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Tamil nadu Cm

Tamil Nadu CM: క్రీడాకారులు వివిధ పోటీల్లో గెలిచి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖుల ఆశీర్వాదాలు తీసుకోవటం మనం చూస్తూనే ఉంటాం. ప్రపంచ కప్ స్థాయి క్రీడల్లో విజేతగా నిలిచిన జట్టుకు, ఆయా రాష్ట్రాల క్రీడాకారులకు ప్రభుత్వాలు సన్మానాలు చేస్తూ గౌరవించుకుంటుంటాయి. ఈ కోవలోనే వీల్‌చైర్ క్రికెట్లో ప్రపంచ‌కప్ సాధించినట్లు ఓ దివ్యాంగుడు ఏకంగా తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌ను కలిశాడు. మామూలుగాకూడా కాదు.. పెద్ద కప్పుతో వెళ్లి ఇదే నేను సాధించిన కప్ అంటూ సీఎంకు చూపించాడు. దివ్యాంగుడి మాటలు నమ్మిన సీఎం, మంత్రులు అతన్ని సన్మానించారు. అయితే, దివ్యాంగుడి అసలు గుట్టు ఇంటిలిజెన్స్ విభాగానికి చేరింది. అతను సీఎం స్టాలిన్, మంత్రులను మోసం చేశాడని తెలుసుకొని అంతా షాక్ అయ్యారు. అసలు సదరు దివ్యాంగుడు ఏ క్రీడల్లోనూ పాల్గొనలేదని, నకిలీ కప్పుతో సీఎం వద్దకు వెళ్లి బురిడీ కొట్టించాడని ఇంటిలిజెన్స్ విభాగం తేల్చేసింది.

Tamil Nadu CM MK Stalin: టార్గెట్ గవర్నర్లు..! బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ

తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా కడలాడి తాలూకా కీళచెల్వనూర్‌కు చెందిన దివ్యాంగుడు వినోద్ బాబు. భారత వీల్‌చైర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అని చెప్పుకుంటూ పలు మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు. అతని చెప్పేదాని ప్రకారం.. వీల్ ఛైర్ క్రికెట్ లో నైపుణ్య కలిగిన క్రీడాకారుడిని అని, 2022లో తను నాయకత్వం వహించిన జట్టు ఆసియా కప్ గెలిచామని చెప్పుకున్నాడు. అతంటితో ఆగకుండా ఓ కప్ తీసుకొని వెళ్లి గత వారంరోజుల క్రితం లండన్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లోనూ విజయం సాధించామని, ఇదే ఆ కప్ అంటూ సీఎం స్టాలిన్‌ను కలిశాడు. సీఎం స్టాలిన్ సైతం అతడు నిజంగానే కప్ సాధించాడని నమ్మి మరో ఆలోచన లేకుండా అతన్ని అభినందించారు. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్ లోనూ షేర్ చేశారు.

Telangana Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం .. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

ఆ ఫొటోలను చూసిన కొందరు.. వినోద్ బాబు చెప్పేవన్నీ అబద్దాలేనని ఇంటిలిజెన్స్ విభాగంకు సమాచారం ఇచ్చారు. వారు విచారణ చేయగా.. అసలు గుట్టురట్టయింది. వినోద్ బాబు అసలు జట్టులో లేడని, అతని కనీసం పాస్ పోర్టుకూడా లేదని ఇంటెలిజెన్స్ విభాగం తేల్చింది. సదరు దివ్యాంగుడు ఇప్పటికే పలువురు మంత్రులను, ప్రముఖులను నమ్మించి వారి నుంచి ఆర్థిక సహాయం పొందాడని విచారణలో తేలింది.

Rajinikanth: బాలకృష్ణపై రజినీకాంత్ కామెంట్స్.. అలా చేయాలంటే బాలయ్య ఒక్కడివల్లే అవుతుంది!

సదరు దివ్యాంగుడి మాటలు నమ్మి ఛత్రకుడికి చెందిన ఓ బేకరీ యాజమాని ఏకంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కూడాచేసినట్లు తెలిసింది. దీంతో వినోద్ బాబు మోసాలపై రామనాథపురం ఏబీజే మిస్సైల్స్ పారా స్పోర్ట్స్ అసోసియేసన్ అధ్యక్షుడు శరవణకుమార్ ఫిర్యాదు మేరకు తంగదురై ఎస్పీ కేసు నమోదు చేశారు. దివ్యాంగుడు వినోద బాబు కోసం వెతుకులాట ప్రారంభించారు.