Casino Money Laundering Case : క్యాసినో కేసు.. ఈడీ ఉచ్చులో ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. ఏం జరుగుతుందోనని టెన్షన్

క్యాసినో, మనీ లాండరింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చీకోటి ప్రవీణ్ ను ఇంటరాగేషన్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు కనబరుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేలక నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు.

Casino Money Laundering Case : క్యాసినో కేసు.. ఈడీ ఉచ్చులో ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. ఏం జరుగుతుందోనని టెన్షన్

Casino Money Laundering Case : క్యాసినో, మనీ లాండరింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చీకోటి ప్రవీణ్ ను ఇంటరాగేషన్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు కనబరుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేలక నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు.

ఈడీ ఉచ్చుకు నలుగురు ఎమ్మెల్యేలు చిక్కడంతో చీకోటి ప్రవీణ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న మిగతా ప్రజాప్రతినిధుల్లోనూ కలవరం మొదలైంది. క్యాసినో, మనీ లాండరింగ్ కేసులో కీలక నిందితుడు చీకోటి ప్రవీణ్ ను నాలుగు రోజుల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. శుక్రవారంతో నాలుగు రోజుల విచారణ పూర్తైంది. చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డితో పాటు క్యాసినో ఏజెంట్లను ఇంటరాగేషన్ చేశారు ఈడీ అధికారులు.

Chikoti Praveen Casino : క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ బృందాన్ని విచారిస్తున్న ఈడీ

నేపాల్ లో జరిగిన క్యాసినోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరనేది కూపీ లాగారు. హవాలా మార్గంలో నగదు బదిలీ జరిగినట్లు గుర్తించారు. నేపాల్ వెళ్లి కేసినో ఆడిన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించిన ఈడీ అధికారులు.. వారికి నోటీసులు జారీ చేశారు.

మొత్తంగా.. క్యాసినో వ్యవహారంలో హవాలా లావాదేవీల విషయంలోనే ఈడీ విచారణ కొనసాగింది. చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డితో పాటు ప్రవీణ్ అనుచరుడు సంపత్ ను అధికారులు విచారించారు. ఆర్థిక లావాదేవీల వివరాలను ఆదాయపన్నుశాఖకు ఈడీ అధికారులు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు తాను ఎవరినీ క్యాసినోకు రమ్మనలేదని వాళ్ల ఇష్టంతోనే ఆడుతున్నారని ప్రవీణ్ స్పష్టం చేశారు. తనకు ప్రాణహాని ఉందని భద్రతను కోరనున్నట్లు తెలిపారు.

నేపాల్‌లో క్యాసినో జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో మనీలాండరింగ్ జరగడంతో రంగంలోకి దిగింది. ఇందుకు హైదరాబాద్‌ నుంచే అంతా జరిగినట్లు తేల్చారు. దీంతో భాగ్యనగరంలో ఈడీ అధికారులు మోహరించారు. చీకోటి ప్రవీణ్ అతడి అనుచరుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చీకోటి ప్రవీణ్‌తోపాటు పలువురిని విచారణకు పిలిచారు. నాలుగు రోజులపాటు వీరిని విచారించారు.

Nepal Casino : క్యాసినో వ్యవహారంలో సినీ తారల ప్రమేయంపై ఈడీ దృష్టి

క్యాసినో వ్యవహారంలో హవాలా జరిగిందని ఈడీ గుర్తించింది. హవాలా లావాదేవీలపై లోతుగా ఆరా తీస్తున్నారు. నేపాల్‌లో జరిగిన క్యాసినోలో ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో పలువురికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నాలుగు రోజులపాటు చీకోటి ప్రవీణ్‌ను ఈడీ అధికారులు విచారించారు. ప్రవీణ్‌తో పాటు అతడి అనుచరులను ప్రశ్నించారు. మనీలాండరింగ్‌, విదేశీ పర్యటలపై ప్రశ్నల వర్షం కురిపించారు. విదేశాల్లో క్యాసినో ఆడించినట్లు గుర్తించారు. ఇందులో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో మరికొంతమందికి ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని, ఇందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. నాలుగు రోజుల విచారణలో చీకోటి ప్రవీణ్‌ దగ్గర నుంచి కీలక విషయాలను ఈడీ వర్గాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw