caste panchayat : రెండో వివాహం చేసుకుందని ఉమ్మి ఊసి నాకి..రూ.లక్ష జరిమానా వేసిన పెద్దలు..

ఓ మహిళ రెండో వివాహం చేసుకుందని కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలంతా ఉమ్మి వేస్తే దాన్ని ఆమె నాకాలని...రూ.లక్ష రూపాయలు జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు.

caste panchayat : రెండో వివాహం చేసుకుందని ఉమ్మి ఊసి నాకి..రూ.లక్ష జరిమానా వేసిన పెద్దలు..

Caste Panchayat Woman To Lick Spit For Second Marriage

caste panchayat woman to lick spit for second marriage : 70 ఏళ్లు వచ్చినా..మగవాళ్లు రెండో పెళ్లే కాదు మూడో పెళ్లి నాలుగో పెళ్లి కూడా చేసుకోవచ్చు. భార్యకు విడాకులు ఇచ్చినవాడు మరో వివాహం చేసుకోవచ్చు. భార్య ఉన్నవాడు కూడా వివాకులు ఇవ్వకపోయినా రెండో వివాహం చేసుకోవచ్చు.అలా చేసినవాళ్లు జల్సా పురుషులు. కానీ ఆడవాళ్లు మాత్రం రెండో వివాహం చేసుకుంటే అదో పెద్ద నేరంగా భావించే వెనుబాటుతనం ఇంకా ఈ కంప్యూటర్ యుగంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ మహిళ రెండో వివాహం చేసుకుందని పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలమీద ఉమ్మి వేసి దాన్ని నాకాలని శిక్ష వేశారు రెండో వివాహం చేసుకన్న మహిళకు. గత ఏప్రిల్ 9న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని వాడ్గావ్ గ్రామంలో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భర్తతో విభేదాలు వచ్చిన విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకున్న 35 ఏళ్ల మహిళను మానసికంగా హింసించారు పంచాయతీ పెద్దలు. మరో పెళ్లి చేసుకున్నందుకు శిక్షగా ఉమ్మిని నాకాలని ఆదేశించారు. అంతేకాదు..ఆమెకు లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బాధిత మహిళ ధైర్యం. రెండో వివాహం చేసుకున్న తనను పంచాయితీకి ఈడ్చి తానేదో పెద్ద నేరం చేసినట్లుగా శిక్ష విధించటాన్ని ఆమె భరించలేకపోయింది. పంచాయితీ పెద్దల తీర్పును ధైర్యంగా ఎదిరించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జలగాం జిల్లాకు చెందిన బాధిత మహిళ ఫిర్యాదుపై చోప్డా సిటీ పోలీసులు ఈ కేసును మే 13న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఈ ఘటన అకోలా జిల్లాలో జరగడంతో కేసును పింజార్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

జలగాం జిల్లాలోని ‘నాత్ జోగి’ సామాజిక వర్గానికి చెందిన బాధిత 35 ఏళ్ల మహిళ 2011లో తొలి వివాహం చేసుకుంది. ఆ తరువాత అతనితో విభేదాలు వచ్చి 2015లో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తరువాత 2019లో రెండో వివాహం చేసుకుంది. కానీ ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అదే సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు సమావేశమై ఆమె రెండో వివాహంపై చర్చించారు. ఆ తరవాత ఆమె సోదరి, బంధువులను పిలిపించారు. రెండో పెళ్లి చేసుకున్నందుకు ఆమె తన కులానికి చెందిన వ్యక్తుల ఉమ్మిని నాకాలనీ అలాగే లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని తీర్పుచెప్పారు.

ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ..కుల పెద్దల తీర్పు ప్రకారం కుల పంచాయతీ పెద్దలందరూ ఓ అరటి ఆకుపై ఉమ్మి వేస్తే దానిని బాధితురాలు నాకాలి. ఈ శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా కూడా ఆమెకు విధించారని పోలీసులు తెలిపారు. తీర్పు చెప్పిన సమయంలో బాధితురాలు అక్కడ లేదని..ఈ శిక్షను పూర్తి చేస్తేనే ఆమెను గ్రామంలోకి రావటానికి అనుమతి ఇస్తామని పెద్దలు చెప్పారనీ..ఈ తీర్పును కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న బాధితురాలు షాక్ అయ్యింది. ఆ వెంటనే చోప్డా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జలగాం జిల్లాకు చెందిన బాధిత మహిళ ఫిర్యాదుపై చోప్డా సిటీ పోలీసులు ఈ కేసును మే 13న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఈ ఘటన అకోలా జిల్లాలో జరగడంతో కేసును పింజార్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.