Mohan Bhagwat: వర్ణం, కులం పండితులే సృష్టించారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు
మతం అంటే సమాజ ఉన్నతి కోసం పని చేయడమని, తన గురించి మాత్రమే ఆలోచించి కడుపు నింపుకోవడం మతం కాదని భాగవత్ అన్నారు. ఈ మాటలు సంత్ రవిదాస్ చెప్పారని, అందుకే సమాజంలోని పెద్దలు సంత్ రవిదాస్ భక్తులుగా మారారని అన్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్, ఓరంగేబుకు మధ్య జరిగిన ఒక సందర్భాన్ని భాగవత్ ప్రస్తావించారు.

Mohan Bhagwat: దేవుడి దృష్టిలో వర్ణం, కులం అంటూ ఏదీ లేదని.. అవి పూజారులు సృష్టించిందని రాష్ట్రీయ స్వయం సేవక్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. దేవుడు మనుషులందరినీ సమానంగా చూస్తారని ఆయన స్పష్టం చేశారు. సంత్ శిరోమణి రవిదాస్ జయంతి సందర్భంగా ఆదివారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి పనులు చేయమని సంత్ రవిదాస్ చెప్పారని, మొత్తం సమాజాన్ని అనుసంధానం చేస్తూ సమాజ పురోగమనానికి కృషి చేయడమే మతమని భాగవత్ అన్నారు.
“మనం జీవనోపాధి పొందినప్పుడు, మనకు సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. ప్రతి పని సమాజం కోసం అయినప్పుడు, ఏదైనా పని అది చిన్నదైనా పెద్దదైనా ఎలా అవుతుంది? తనకు అందరూ సమానమే అని భగవంతుడు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాడు. కులం, వర్ణం లేనే లేవు. వాటికి ఆధారాలు కూడా లేవు. వాటిని పండితులు సృష్టించారు. నిజానికి అది చాలా పెద్ద తప్పు” అని భాగవత్ అన్నారు.
Aaditya Thackeray: చిన్న పిల్లాడు, అంత మెచ్యూరిటీ లేదు.. ఆదిత్య థాకరే ఛాలెంజ్పై షిండే సేన
మతం అంటే సమాజ ఉన్నతి కోసం పని చేయడమని, తన గురించి మాత్రమే ఆలోచించి కడుపు నింపుకోవడం మతం కాదని భాగవత్ అన్నారు. ఈ మాటలు సంత్ రవిదాస్ చెప్పారని, అందుకే సమాజంలోని పెద్దలు సంత్ రవిదాస్ భక్తులుగా మారారని అన్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్, ఓరంగేబుకు మధ్య జరిగిన ఒక సందర్భాన్ని భాగవత్ ప్రస్తావించారు. కాశీ ఆలయాన్ని ధ్వంసం చేసిన అనంతరం ‘’హిందువులు, ముస్లింలు అందరూ ఒకే దేవుడి బిడ్డలు’’ అని ఔరంగజేబుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ లేఖ రాస్తూనే.. ‘‘మీ (ఔరంగాజేబు) పాలనలో అణచివేతకు గురవుతున్నారు. అది సరికాదు. అందరినీ గౌరవించడం నీ కర్తవ్యం. ఇంతటితో ఆగకుంటే కత్తిమీద సాము చేసినట్టే’’ అని ఔరంగాజేబుకు రాసిన లేఖలో ఛత్రపతి శివాజీ పేర్కొన్నట్లు మోహన్ భాగవత్ అన్నారు.