అమెజాన్ నదిలో ఉండే చేపలు గంగానదిలో..దేశానికే ప్రమాదమంటున్న సైంటిస్టులు

  • Published By: nagamani ,Published On : September 30, 2020 / 05:23 PM IST
అమెజాన్ నదిలో ఉండే చేపలు గంగానదిలో..దేశానికే ప్రమాదమంటున్న సైంటిస్టులు

Danger Sucker Mouth Catfish in Ganga river : ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ నదిలో ఉండే ‘‘సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్’’ వారణాసిలోని గంగానదిలో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.



ఈ చేప వారణాశిలో గంగానదిలో కనిపించేసరికి సైంటిస్టులు సైతం షాక్ అయ్యారు.అంతేకాదు ఈ చేపవల్ల చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు సైంటిస్టులు.



చాలా ప్రమాదమంటున్న సైంటిస్టులు
ఈ వింత చేపను.. వారణాసిలోని రాంనగర్‌ గంగానదిలో కనిపెట్టారు. ఇది చిత్రంగా ఉండటంతో స్థానికులు ఇది ఏం చేప అని సైంటిస్టులకు చూపించి అడుగగా దాన్ని చూడగానే సైంటిస్టులు ఉలిక్కిపడ్డారు.




వామ్మో ఇది గంగానదిలో ఉందా చాలా ప్రమాదమే..ఇది మాంసం తినే చేప ఈ చేప ఏ నీటిలో ఉంటే ఆ నీటిలో ఉండే ఇతర చేపలతో పాటు అన్ని రకాల నీటి జంతువులను తినేస్తుందని దీంతో ఆ ప్రాంతంలో ఉండే ప్రాణులకు చాలా ప్రమాదమని తెలిపారు.ఇటువంటి చేపలు ఇండియాలోకి ప్రవేశిస్తే.. అన్ని నదుల్లో జీవులకూ డేంజరేనని ఆందోళన వ్యక్తంచేశారు.

డాల్ఫిన్ల రక్షణ ప్రాంతంలో రెండవసారి కనిపించిన ‘‘సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్’’
గంగానదిలో… డాల్ఫిన్లను కాపాడేందుకు ప్రత్యేక గంగా గార్డులు పనిచేస్తున్నారు. ఈ చేప వల్ల డాల్ఫిన్లకు ప్రమాదకరమనీ..డాల్ఫిన్ల రక్షణ ప్రాంతంలో ఇలాంటి చేప కనిపించడం ఇది రెండోసారి అని నమామీ గంగా ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న ప్రహరి దర్శన్ నిషాద్ తెలిపారు.


కాగా..గతంలో ఓ సారి మొదటిసారి గంగానదిలో ఇటువంటి చేపే కనిపించింది. ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ వారు కనిపెట్టిన ఆ చేప బంగారు రంగులో ఉందని తెలిపారు.గంగానదిలో ఇప్పటికే ఇటువంటివి రెండు చేపలు కనిపించాయంటే..ఇంకా ఇటువంటివి చాలా ఉండే ఉంటాయనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఇతర చేపలు..పర్యావరణాన్ని నాశనం చేస్తాయని..గంగానదిలో ఎవరికైనా ఇలాంటి చేపలు దొరికితే… ఎట్టి పరిస్థితుల్లో వాటిని తిరిగి నదిలో వదలొద్దని సమీపంలోని సంబంధిత అధికారులను తెలపాలని సైంటిస్టులు పదే పదే సూచించారు. ఈ చేపను ఎట్టి పరిస్థితుల్లోను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు.

సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్‌లు చాలా రంగుల్లో ఉంటాయని..ఇవి అమెజాన్ నది నుంచి… గంగా నదిలోకి ఎలా వస్తున్నాయన్నది తేలాల్సిన మిస్టరీగా మారింది.