Leopard Attack: వాహనాలపైకి దూసుకెళ్లిన చిరుత… ఇళ్లల్లోకి చొరబడి దాడి.. 13 మందికి గాయాలు

తాజాగా అసోంలో ఒక చిరుత పులి జనావాసాల్లోకి చొరబడింది. అసోం, జోర్హాత్ జిల్లాలో ఒక చిరుత పులి సోమవారం నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చింది. అనేక మందిపై దాడికి పాల్పడింది.

Leopard Attack: వాహనాలపైకి దూసుకెళ్లిన చిరుత… ఇళ్లల్లోకి చొరబడి దాడి.. 13 మందికి గాయాలు

Leopard Attack: పులులు, చిరుత పులులు జనవాసాల్లోకి చొరబడే ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అడవుల్ని వదిలేసి జనావాసాలకు దగ్గరగా వస్తున్నాయి. ఈ ఘటనల్లో ఇటీవలి కాలంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు గాయపడుతున్నారు.

China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా

తాజాగా అసోంలో ఒక చిరుత పులి జనావాసాల్లోకి చొరబడింది. అసోం, జోర్హాత్ జిల్లాలో ఒక చిరుత పులి సోమవారం నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చింది. అనేక మందిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఫారెస్ట్ అధికారులతోపాటు స్థానికులపై దాడి చేసింది. చిరుతపులి దాడిలో మొత్తం 13 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. స్థానిక రెయిన్ ఫారెస్ట్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది. చిరుత పులి ఈ ప్రాంతంలోకి దూసుకురావడాన్ని కొందరు స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా

కాగా, గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రుల్లో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు బృందాలు ఇక్కడ పనిచేస్తున్నాయని, చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు.