CBDT : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బులు రీఫండ్

67.99 లక్షల రీఫండ్స్ ఉన్నట్లు, 2021-22 అసెస్ మెంట్ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ. 13 వేల 141 కోట్ల రీఫండ్ జారీ చేయడం జరిగిందని వివరించింది.

CBDT : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బులు రీఫండ్

Tax

CBDT Issues Refunds : పన్ను చెల్లింపు దారులకు గుడ్ న్యూస్ వినిపించింది ఆదాయపు పన్ను శాఖ. అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 01వ తేదీ నుంచి నవంబర్ 15 మధ్యకాలంలో 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు 1.19 లక్షల కోట్ల రూపాయలకు పైగా..అదనపు పన్ను రీఫండ్ చేసినట్లు ఐటీ విభాగం తెలిపింది.

Read More : Rain In Tirupati : తిరుమల ఆగమాగం…ఘాట్ రోడ్డులో నో ఎంట్రీ, ప్రజలు బయటకు రావొద్దు

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…67.99 లక్షల రీఫండ్స్ ఉన్నట్లు, 2021-22 అసెస్ మెంట్ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ. 13 వేల 141 కోట్ల రీఫండ్ జారీ చేయడం జరిగిందని వివరించింది. 1,00,42,619 కేసుల్లో రూ. 38,034 కోట్ల ఆదాయపన్ను కేసుల్లో రీఫండ్లు జారీ చేసింది.

Read More : Viral ‘onion’: ఈ ఉల్లిని కట్‌ చేస్తే ‍కన్నీళ్లు రానేరావు..! మరి ఆ సీక్రెట్ ఏంటో తేల్చేసుకోండీ..

1,80,407 కేసుల్లో…రూ. 81,059 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్లు జారీ చేసినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. 2021 ఏప్రిల్ నుంచి నవంబర్ 15 వరకు 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 1,19,093 కోట్లకు పైగా రీ ఫండ్ జారీ చేయడం జరుగుతుందని సమాచారం.