బిగుస్తున్న ఉచ్చు : చందాకొచ్చర్‌పై సీబీఐ కేసు

  • Published By: madhu ,Published On : January 24, 2019 / 11:19 AM IST
బిగుస్తున్న ఉచ్చు : చందాకొచ్చర్‌పై సీబీఐ కేసు

ఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్‌కి మరో షాక్ తగిలింది. సీబీఐ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆమె భర్త దీపక్ కొచ్చార్, వీడియోకాన్ గ్రూపు ఎండీ వేణుగోపాల్ దూత్ కేసు నమోదు చేసింది. ప్రైవేటు కంపెనీలకు రుణాలు మంజూరు చేసి ఐసీసీఐ బ్యాంకును మోసం చేసిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.  వీడియో కాన్ రుణాల కేసులో క్విడ్ ప్రో జరిగిందని సీబీఐ భావిస్తోంది. 2012 సంవత్సరంలో ఐసీసీఐ బ్యాంకు నుండి రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. అప్పుడు ఐసీఐసీఐ బాస్‌గా చందకొచ్చార్ ఉన్నారు. జనవరి 24వ తేదీ గురువారం ముంబై, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లలో సీబీఐ దాడులు జరిపింది. ముంబైలోని నారిమన్ పాయింట్ సమీపంలో ఉన్న వీడియోకాన్ మెయిన్ ఆఫీస్‌పై సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. ఈ కేసులో పలువురిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 

వీడియో కాన్ గ్రూపు రుణాల్లో అవతవకలు జరిగాయని ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవిలో ఉన్న చందా కొచ్చర్‌పై ఆరోపణలు వచ్చాయి. 2012 సంవత్సరంలో వీడియోకాన్ గ్రూపు రూ. 3,250 కోట్ల రుణాలు పొందిందని…దీనివల్ల కొచ్చర్ ఫ్యామిలీ లాభ పడిందనే ఆరోపణలు సంచలనాత్మకమయ్యాయి. ఈ తరుణంలో కొచ్చర్ 2018, అక్టోబర్ 4వ తేదీన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పదవీ కాలానికి ముందుగానే బాధ్యతల నుండి తప్పుకోవాలని ఆమె అభ్యర్థనను బ్యాంకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.