CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎడిషనల్ డైరక్టర్ ఎమ్ నాగేశ్వరరావుపై పరువు నష్టం దావా కేసు నమోదు అయింది. బీహార్ నివాసి అయిన ఓ అధికారి ట్రాన్సఫర్‌కు నాగేశ్వర్ ఆర్డర్ ఇవ్వడంతో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌ఫర్‌ తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పినప్పటికి అతనిపై రూ.లక్ష జరిమానా విధించి రోజంతా కోర్టులోనే ఓ మూలన కూర్చోమని ఆంక్షలు జారీ చేసింది. 

ముజఫర్ ప్రాంతంలోని రేప్ కేసు విషయంలో విచారణ జరుపుతున్న ఇన్వెస్టిగేషన్ అధికారి ఏకే శర్మను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రకటనలు జారీ చేశాడు నాగేశ్వరరావు. కేసు విచారణలో ఉండగా కోర్టు పర్మిషన్ లేకుండా ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఈ నిబంధనలు ఉల్లంఘించిన నాగేశ్వర్ తప్పకుండా శిక్షను అనుభవించాల్సేందనంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 

ఛీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ మాట్లాడుతూ.. నాగేశ్వర్ రావు 32 ప్రొఫెషనల్ కెరీర్‌కు ఇది మాయని మచ్చలా మారడం ఖాయమని అభిప్రాయపడ్డారు.  కోర్టు తీర్పు ప్రకారం.. ఏకే శర్మ కేసు పరిశోధన పూర్తయ్యేంత వరకూ ట్రాన్స్‌ఫర్ అయి వేరే చోటుకు వెళ్లరంటూ తేల్చి చెప్పింది.