దేశవ్యాప్తంగా 188 ప్లేస్ లలో సీబీఐ సోదాలు

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2019 / 02:20 PM IST
దేశవ్యాప్తంగా 188 ప్లేస్ లలో సీబీఐ సోదాలు

దేశవ్యాప్తంగా 188 ప్లేస్ లలో ఇవాళ(నవంబర్-5,2019)సీబీఐ సోదాలు నిర్వహించింది. 7వేల200 కోట్ల రూపాయల మేరకు 42 బ్యాంకులను మోసం చేసిన కేసులకు సంబంధించి సీబీఐ దేశవ్యాప్త సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఇందులో నాలుగు కేసుల్లో ప్రశ్నించిన మొత్తం విలువ ₹ 1,000 కోట్లకు పైగా ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.

15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు చేశారు.  ఆంధ్రప్రదేశ్, ఛండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక. కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దాద్రా అండ్ నగర్ హవేలీ సహా మొత్తం 169 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

భోపాల్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కు రూ.1266 కోట్ల తప్పుడు నష్టం కలిగించినందుకు అడ్వాంటేజ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదైంది. సంస్థ, దాని ఉన్నతాధికారులపై మోసం, ఫోర్జరీ మరియు క్రిమినల్ దుష్ప్రవర్తన కింద అభియోగాలు మోపారు. ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కు రూ.1100.73 కోట్ల తప్పుడు నష్టం కలిగించినందుకు ఎనర్గో ఇంజనీరింగ్ పై మరో కేసు నమోదైంది. వివిధ కంపెనీలపై కూడా సీబీఐ కేసులు నమోదుచేసింది.