GST REFUND: వ్యాపారులకు గుడ్ న్యూస్..నెలాఖరుకల్లా జీఎస్టీ రీఫండ్

కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు తీపికబురు అందించింది.

GST REFUND: వ్యాపారులకు గుడ్ న్యూస్..నెలాఖరుకల్లా జీఎస్టీ రీఫండ్

Cbic

CBIC కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు తీపికబురు అందించింది. పెండింగ్ లో ఉన్న అన్ని జీఎస్టీ రిఫండ్స్ ను క్లియర్ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరక్ట్ టాక్సస్ అండ్ కస్టమ్స్(CBIC)ఓ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించింది. వ్యాపారులు లిక్విడిటీ సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది.

స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా భాగంగా ఈ నెల 14వ తేదీ నాటికి పెండింగ్‌లో ఉన్న అన్ని జీఎస్‌టీ రిఫండ్‌ క్లెయిమ్‌ లను మే 31లోగా క్లియర్ చేయాలని సీబీఐసీ.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌ కష్టకాలంలో పరిశ్రమలను ముఖ్యంగా ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కారణంగా చాలా మంది వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్రం తాజా నిర్ణయంతో వీరికి ఊరట కలుగనుంది.

కాగా, జీఎస్‌టీ చట్టం ప్రకారం రిఫండ్ సెటిల్‌మెంట్‌కు 60 రోజుల దాకా గడువు ఉంటంది. అయితే జీఎస్‌టీ రిఫండ్ క్లెయిమ్ అప్లికేషన్ వచ్చిన 30 రోజుల్లోనే సెటిల్‌మెంట్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.