CBSE Exams : రెండు భాగాలుగా సీబీఎస్​ఈ సిలబస్, ఎగ్జామ్స్

కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం సరికొత్త విధానాన్ని సీబీఎస్​ఈ(Central Board of Secondary Education)ప్రకటించింది.

CBSE Exams : రెండు భాగాలుగా సీబీఎస్​ఈ సిలబస్, ఎగ్జామ్స్

Cbse

CBSE Exams కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం సరికొత్త విధానాన్ని సీబీఎస్​ఈ(Central Board of Secondary Education)ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు సంబంధించి విద్యాసంవత్సరాన్ని రెండు భాగాలుగా చేయనున్నట్లు సీబీఎస్​ఈ బోర్డు సోమవారం ప్రకటించింది. సిలబస్​ను కూడా రెండు భాగాలు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఒక పరీక్షను నవంబర్- డిసెంబర్​ 2021లో, మరో పరీక్షను మార్చి- ఏప్రిల్​ 2022 లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ రెండు పరీక్షల్లోని ఫర్ఫార్మెన్స్ ఆధారంగా తుది ఫలితాలు ప్రకటించబడతాయి మరియు రెండు టర్మ్ ఎగ్జామ్ లకు పరీక్షలకు సమాన వెయిటేజ్ ఇవ్వబడుతుంది. ఈ మేరకు సీబీఎస్ఈ ఓ సర్క్యులర్ జారీ చేసింది.