CBSE : సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల..బాలికలదే పైచేయి

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

CBSE :  సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల..బాలికలదే పైచేయి

CBSE సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు.. సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.inలో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ నెలాఖరులోగా పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సీబీఎస్​ఈ, ఇతర రాష్ట్ర బోర్డులను సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించించిన నేపథ్యంలో సీబీఎస్ఈ ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది. 10 వ తరగతి, 11 వ తరగతి, ప్రీ-బోర్డ్ పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలను విడుదల చేశారు. 10 వ తరగతి పరీక్ష ఆధారంగా 30 శాతం మార్కులు, 11 వ తరగతి ఆధారంగా 40 శాతం మార్కులు 12 వ తరగతి యూనిట్, మిడ్ టర్మ్, ప్రీ-బోర్డ్ పరీక్షల ఆధారంగా మార్కులు నిర్ణయించారు.

ఈ ఏడాది మొత్తంగా 99.37శాతం ఉత్తీర్ణత శాతం 99.37శాతంగా ఉంది. ఈ ఏడాది 70 వేల మందికిపైగా విద్యార్థులు 95శాతంకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులైనట్లు సీబీఎస్​ఈ వెల్లడించింది. మరో లక్షన్నర మందికిపైగా 90శాతం మార్కులు సాధించినట్లు తెలిపింది. మొత్తం బాలురుకన్నా బాలికలే అధిక ప్రతిభ కనబరిచారని చెప్పింది. మరో 65 వేల మంది విద్యార్థుల గ్రేడ్లు ఇంకా నిర్ణయించాల్సి ఉందని, వాటిని ఆగస్టు 5న ప్రకటిస్తామని సీబీఎస్​ఈ తెలిపింది. కాగా,ఈ ఏడాది కరోనా కారణంగా సీబీఎస్​ఈ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే.