CBSE : 10,12వ పరీక్షలపై సీబీఎస్ఈ కీలక ప్రకటన

 10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ బోర్డు పరీక్షలపై గురువారం సీబీఎస్​ఈ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నవంబర్​- డిసెంబర్​లో ఆఫ్​లైన్​ విధానంలో 10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ ఎగ్జామ్స్ జరుగుతాయని

CBSE : 10,12వ పరీక్షలపై సీబీఎస్ఈ కీలక ప్రకటన

Cbse

CBSE   10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ బోర్డు పరీక్షలపై గురువారం సీబీఎస్​ఈ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నవంబర్​- డిసెంబర్​లో ఆఫ్​లైన్​ విధానంలో 10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ ఎగ్జామ్స్ జరుగుతాయని,అందుకు సంబంధించిన డేట్​ షీట్​ అక్టోబర్-18న విడుదల చేయనున్నట్టు సీబీఎస్​ఈ తెలిపింది. ఉదయం 11:30కి పరీక్షలు ప్రారంభమవుతాయని, ఒక్కో ఎగ్జామ్ నిడివి 90 నిమిషాలు కాగా..ఆబ్జెక్టివ్​ విధానంలో పరీక్షలు ఉంటాయని సీబీఎస్​ఈ తెలిపింది.

ఇక,10 వ తరగతి మరియు 12 వ తరగతి సబ్జెక్టులను రెండు గ్రూపులు-చిన్న మరియు పెద్ద సబ్జెక్టులుగా విభజించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. విద్యార్థుల లెర్నింగ్ లాస్ నివారించడానికే ఇలా నిర్ణయించినట్లు సీబీఎస్ఈ తెలిపింది. సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలు 189 పేపర్లకు నిర్వహించబడతాయి. 10 వ తరగతి మరియు 12 వ తరగతి అన్ని సబ్జెక్టులకు ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తే, అది పూర్తి కావడానికి 40-45 రోజులు పడుతుందని బోర్డు తెలిపింది. కాబట్టి మొదట మైనర్ సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహిస్తుంది, తరువాత ప్రధాన సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది.

కాగా,కరోనా కారణంగా గతంలో.. 2021-22 విద్యాసంవత్సరానికి సీబీఎస్​ఈ మార్పులు చేసిన విషయం తెలిసిందే. విద్యాసంవత్సరాన్ని రెండుగా విభజించి.. రెండు టర్మ్​-ఎండ్​ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే సిలబస్​లోనూ మార్పులు చేసింది. రెండు టర్మ్​ పరీక్షలు అయిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేస్తారు. ఫస్ట్​ టర్మ్​ పరీక్షలకు ముందే, ఇంటర్నల్​ అసెస్​మెంట్లు, ప్రాక్టికల్​ పరీక్షలు పూర్తవుతాయి. ఇందుకోసం 50శాతం మార్కులు కేటాయిస్తారు. 2022 మార్చి-ఏప్రిల్​లో సెకండ్ టర్మ్​ పరీక్షలు జరగనున్నాయి.

ALSO READ  ఎస్పీకి 400 సీట్లు పక్కా..ఫేక్ బాబా కథ త్వరలో ముగుస్తుంది