CBSE : సీబీఎస్​ఈ 12వ తరగతి గ్రేడింగ్ కోసం కమిటీ

కరోనా వైరస్ కారణంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే.

CBSE : సీబీఎస్​ఈ 12వ తరగతి గ్రేడింగ్ కోసం కమిటీ

Cbse To Finalise Evaluation Strategy By June 15

CBSE కరోనా వైరస్ కారణంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దయిన నేపథ్యంలో విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపు విధివిధానాల రూపకల్పన కోసం 13 మంది సభ్యులతో ఒక కమిటీని సీబీఎస్​ఈ ఏర్పాటు చేసింది. విద్యార్థుల ఉత్తీర్ణత స్థాయిని నిర్ణయించేందుకు అవలంబించాల్సిన మార్గదర్శకాలతో ఈ కమిటీ జూన్-15లోగా తన నివేదిక సమర్పించనుంది.

మరోవైపు,సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేయడంతో..చాలా రాష్ట్రాలు కూడా 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. గుజరాత్,మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు..తాము కూడా 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించగా,కర్ణాటక,ఒడిషా రాష్ట్రాలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించాయి.