CBSE : వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏడాదికి ఒకసారే సీబీఎస్ఈ పరీక్ష..!

CBSE single board exams : సీబీఎస్ఈ విద్యార్థులకు శుభవార్త.. వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి ఏడాదిలో ఒకసారి మాత్రమే సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

CBSE : వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏడాదికి ఒకసారే సీబీఎస్ఈ పరీక్ష..!

Cbse To Restore Single Board Exams Format From Next Academic Year

CBSE single board exams : సీబీఎస్ఈ విద్యార్థులకు శుభవార్త.. వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి ఏడాదిలో ఒకసారి మాత్రమే సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారికి ముందు సీబీఎస్ఈ బోర్డు పరీక్షల విధానాన్నే మళ్లీ పున: ప్రారంభించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. కరోనా పరిస్థితుల్లో టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను రెండు టర్ములుగా నిర్వహస్తూ వచ్చారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో గతంలో మాదిరిగా ఏడాదికి ఒకే సారి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

సీబీఎస్ఈ గత (2021-22) విద్యా సంవత్సరంలో కరోనా మహమ్మారి రెండో వేవ్‌ కారణంగా పరీక్షలను రెండు టర్ములుగా తాత్కాలికంగా నిర్వహించింది బోర్డు. టర్మ్-I బోర్డు పరీక్షలు 2021లో నవంబర్-డిసెంబర్‌ మధ్య నిర్వహించారు. టర్మ్-II పరీక్షలను 2022 ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి. ఇక 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రం సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను పూర్తిగా ఎత్తేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీబీఎస్ఈ బోర్డు స్కూళ్లలో తిరిగి ఒకే పరీక్ష విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

కరోనా కారణంగానే గత ఏడాది రెండు టర్ముల పరీక్ష విధానాన్ని ప్రవేశ పెట్టినట్టు అధికారులు తెలిపారు. ఇకపై ఈ విధానం కొనసాగదని, పాత పద్ధతిలోనే సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా 30 శాతం తగ్గించిన సిలబస్‌నే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక సిలబస్‌ పునరుద్ధరణపై NCERT నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. ప్రస్తుత సిలబస్‌ ప్రకారమే తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు.

Read Also : CBSE : సీబీఎస్ఈ టర్మ్ – 2 పరీక్షలు.. షెడ్యూల్ ఇదే