Updated On - 9:34 am, Tue, 2 March 21
cc cameras for cow dung protection: సాధారణంగా ఇళ్లు, ఆఫీసులు, షాపుల్లో సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు వాడతారన్న విషయం తెలిసిందే. భద్రత కల్పించే విషయంలో చోరీలు, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అయితే, ఆవు పేడ రక్షణ కోసం కూడా సీసీ కెమెరాలు వాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే నమ్ముతారా?
ఆవు పేడ రక్షణకు సీసీటీవీ కెమెరాలేంటి అని ఆశ్చర్యపోతున్నారా? రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా దొరికే ఆవు పేడ కోసం సీసీ కెమెరాలు వాడటం ఏంటి? జోక్ కాకపోతే అని పుసుక్కున అనేయకండి. మన దగ్గర ఆవు పేడ కాస్ట్లీ కాకపోవచ్చు, కానీ, అక్కడ మాత్రం చాలా ఖరీదైనదే.
అవును, ఛత్తీస్‌గఢ్‌లో ఆవు పేడకు ఫుల్ డిమాండ్ ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం 2020లో గౌ-దాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. కిలో ఆవు పేడను రూ.2కి కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి ఆవు పేడకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఆవు పేడ దొంగతనాలూ పెరిగాయి. రాత్రికి రాత్రి ఆవు పేడ మాయమైపోతోంది. ఆవు పేడ దొంగలు ఎక్కువైపోయారు.
తాజాగా అంబికాపుర్ మున్సిపాల్టీలో స్థానిక ప్రభుత్వ గౌ-దాన్ కేంద్రానికి దొంగల బెడద ఎక్కువైంది. ఈ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగలించుకుపోతున్నారు. రీసెంట్ గా ఆవు పేడను దొంగలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. వారి నుంచి 45 కేజీల పేడను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వరుస దొంగతనాలు అధికారులకు తలనొప్పిగా మారింది. వారికి నిద్ర కరువైంది. దీంతో వారు ఐడియా వేశారు. గౌ-దాన్ కేంద్రాల దగ్గర సీసీటీవీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలన్న యోచనలో ఉన్నారు అధికారులు.
Israel : వేగంగా వ్యాక్సినేషన్ పంపిణీ..ఆ దేశాల్లో కరోనా తగ్గుముఖం..ఇజ్రాయెల్ ముందు చూపు
వాట్ ఏ ఐడియా : మయన్మార్ లో ఆందోళనలు, రోడ్లపై మహిళల దుస్తులు
పెరిగిపోతున్న పేడ దొంగతనాలు..! మహిళల నుంచి భారీస్థాయిలో పేడ స్వాధీనం!
వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్, మెసేజ్లు పంపలేరు, మే 15 నుంచి అమలు
రైతుల రైల్ రోకో, భారీగా పోలీసుల బందోబస్తు
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఒక్కడోసు, 66 శాతం సమర్థవంతం