హత్రాస్ కేసులో కీలక ఆధారాలైన సీసీటీవీ ఫుటేజి డిలీట్

హత్రాస్ కేసులో కీలక ఆధారాలైన సీసీటీవీ ఫుటేజి డిలీట్

Hathras బాధితురాలైన 19ఏళ్ల యువతి gang-rape, మర్డర్ కేసు విచారణలో CBIటీం జిల్లా హాస్పిటల్ కు చేరుకుంది. మొట్టమొదటగా ట్రీట్‌మెంట్ కోసం బాధితురాలిని తీసుకెళ్లింది అక్కడికే. కీలక ఆధారాన్ని మిస్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 14న యువతిని హాస్పిటల్ కు తీసుకొచ్చినప్పటి నుంచి సీసీటీవీ వీడియో డిలీట్ అయింది.

పైగా అది బ్యాకప్ చేయడానికి కూడా వీలు లేకుండా మారింది. ‘ఆ సమయంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీసులు గానీ సీసీటీవీ ఫుటేజీ గురించి ప్రశ్నించలేదు. నెల రోజుల తర్వాత దానిని తాము ప్రొవైడ్ చేయలేమని’ హాస్పిటల్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్, ఇంద్ర వీర్ సింగ్ చెప్పారు.



హాస్పిటల్ మేనేజ్మెంట్ ముందుగా ఎవరైనా అడిగితే దానిని సేవ్ చేసి ఉంచేవాళ్లమని.. ‘ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఫుటేజి డిలీట్ అయిపోతుందని.. కొత్త ఫుటేజి దాని స్థానంలో రికార్డ్ అవుతుందని’ చెప్పారు.

CBI టీం హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ల స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. మొదటి రోజు చేర్పించనప్పటి సీసీటీవీ అనేది కీలకం. బాధితురాలిని చేర్పించినప్పుడు ఆమెతో వచ్చిందెవరు.. మాట్లాడిందెవరు.. హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ ఇచ్చిందెవరు అని సీబీఐ ప్రశ్నిస్తుంది.

పోలీసులు ముందుగా అడ్మినిస్ట్రేషన్ ను సీసీటీవీ గురించి ఎందుకు ప్రశ్నించలేదు. హాస్పిటల్ క్రైం రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ లో చేసేదేం ఉండదు. ‘హాస్పిటల్ లో క్రైం జరిగినా లేదా ఏదైనా నిర్లక్ష్యం కనిపించినా అప్పుడు క్రైం అనుకుంటాం. కానీ, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా హాస్పిటల్ ను ఎందుకు ప్రశ్నిస్తాం. ఇవన్నీ సంబంధం లేని విషయాలు. అందుకే సీసీటీవీ ఫుటేజి కోసం ప్రశ్నించలేదు’ అని ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు.

బాధితురాలి తండ్రి, సోదరులను CBI మళ్లీ ప్రశ్నించింది. బుధవారం ఉదయం 11గంటల 30నిమిషాలకు మొదలుపెట్టిన విచారణ ఏడు గంటల పాటు జరిగింది. ఆ తర్వాత స్థానిక పోలీసులు వారిని ఇంటి దగ్గర విడిచిపెట్టారు.