Madhya Pradesh : ఆయా అరాచకం-రెండేళ్ల బాలుడికి చిత్రహింసలు
పనిమనిషి అకృత్యానికి ఓ చిన్నారి మౌన రోధన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పిల్లాడిని చూసుకుంటానంటూ పనిలోకొచ్చి.. బాబుకు నరకయాతన చూపించింది. చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో .. పసివాడి అంతర్గత అవయవాలు బాగా వాచిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Madhya Pradesh : పనిమనిషి అకృత్యానికి ఓ చిన్నారి మౌన రోధన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పిల్లాడిని చూసుకుంటానంటూ పనిలోకొచ్చి.. బాబుకు నరకయాతన చూపించింది. చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో .. పసివాడి అంతర్గత అవయవాలు బాగా వాచిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది.
భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగస్తలు అవటంతో.. తమ రెండేళ్ల చిన్నారిని చూసుకునేందుకు వారు పనిమనిషిని పెట్టారు. భోజనం పెట్టి నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ఇక రోజూ ఇద్దరూ డ్యూటీలకు వెళ్లొస్తున్నారు. అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో .. పిల్లాడిలో మార్పు రావడం మొదలైంది. ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే బాబు.. ఒక్కసారిగా డల్ అయ్యాడు. బాగా నీరసించిపోయాడు. ఒకటి రెండు రోజులు ఇది మామూలేలే అనుకున్న వారికి .. రోజూ అలాగే ఉండటంతో అనుమానం వచ్చింది.
వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు .. అతను చెప్పింది విని షాక్ అయ్యారు. పైకి మామూలుగా కనిపిస్తున్న రెండేళ్ల చిన్నారి అంతర్గత అవయవాలు .. బాగా వాచిపోయాయి. ఇందుకు కారణం బాగా చిత్రహింసలు పెట్టడమే అన్నారు.. డాక్టర్. అసలు ఏం జరుగుతోందో.. ఎందుకు ఇలా అయిందో అర్ధకాక.. వైద్యుడి సలహాతో ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చారు. రెండు రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ చూసిన దంపతులు హతాశులయ్యారు.
పనిమనిషి రజని పిల్లాడిని పెడుతున్న చిత్రహింసలు చూసి.. కన్నీటి పర్యంతం అయ్యారు. అన్నం తినకపోయినా.. వాష్‌రూమ్‌కి వెళ్లినా .. చెప్పిన మాట వినకపోయినా.. తాను ఫోన్ చూసుకుంటున్నప్పుడు డిస్ట్రబ్ చేసినా.. ఇక పనిమనిషి .. పిల్లాడిపై తన ప్రతాపం చూపిస్తోంది. కనికరం లేకుండా రెండేళ్ల చిన్నారిని చితక బాదుతోంది. జుట్టుపట్టుకుని ఈడ్చేయడం.. మెడ పట్టుకుని పైకి లేపడం.. కడుపులో ఇష్టం వచ్చినట్లు కొట్టడం చేస్తోంది.
ఇది చూసిన తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. తాము ఉన్నప్పుడు గారాబంగా చూసుకుంటున్నట్లు నటిస్తూనే.. వాళ్లు అలా గడప దాటగానే .. చిన్నారిని దారుణంగా కొడుతుండటంతో.. వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిమనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు .. రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను పనివాళ్ల దగ్గర వదిలేయాల్సి వచ్చినప్పుడు కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. అసలు ఎలా చూస్తున్నారనేదాన్ని ఓ కంట కనిపెట్టాలని పోలీసులు చెబుతున్నారు.
Also Read : Marakatha Ganapathi : 90 కిలోల ‘పంచముఖ మరకత గణపతి’ విగ్రహం..! ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షం..!!
- Bear Kills Couple : గుడిలో ప్రార్థనలు చేస్తుండగా ఘోరం.. దంపతులను చంపి తిన్న ఎలుగుబంటి
- Uttarakhand: ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం.. 22 మంది మృతి
- Supreme Court : ఆర్య సమాజ్ పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..వారిచ్చే వివాహ ధ్రువపత్రం చెల్లదు
- Water Problem : తాగునీటి కష్టాలు..60 అడుగుల లోతు బావిలో దిగి నీటిని తీసుకెళ్తున్న మహిళలు
- Rajya Sabha : రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
1Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
2prophet row: రాజస్థాన్‌లో తీవ్ర కలకలం.. హింసాత్మక ఘటనలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
3Eoin Morgan Retire : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
4ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా
5Extra Marital Affair : వివాహేతర సంబంధం-ఉపాధ్యాయుడి హత్య
6హస్తినకు చేరిన మహారాష్ట్ర రాజకీయం
7గవర్నర్ తమిళిసైకి ఫ్లవర్ బొకే ఇచ్చిన సీఎం కేసీఆర్
8Ukraine: యుక్రెయిన్‌లో ఇళ్ళు వదిలి దేశంలోని ఇతర ప్రాంతాలకు 62 లక్షల మంది
9ఓటీటీలో సినిమాల విడుదలపై కీలక నిర్ణయం
10ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యూబేషన్ సెంటర్‌గా టీ-హబ్ -2
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్