Digitization of Census : డిజిటల్‌ పద్ధతిలో జనన, మరణాల జాబితా.. అంతా ఆటో అప్‌డేట్..!

Digitization of Census : దేశంలో జనాభా లెక్కల్లో పుట్టేవారు, మరణించే వారి డేటా ఆటోమెటిక్‌గా అప్‌డేట్ కానుంది. జనాభా లెక్కలను డిజిటల్‌ పద్ధతిలో నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు.

Digitization of Census : డిజిటల్‌ పద్ధతిలో జనన, మరణాల జాబితా.. అంతా ఆటో అప్‌డేట్..!

Census Operations Amit Shah Announces Digitisation Of Census, To Be Linked With Birth, Death Register

Digitization of Census : దేశంలో జనాభా లెక్కల్లో పుట్టేవారు, మరణించే వారి డేటా ఆటోమెటిక్‌గా అప్‌డేట్ కానుంది. జనాభా లెక్కలను డిజిటల్‌ పద్ధతిలో నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలను నేరుగా డిజిటల్‌ సెన్సస్‌కు అనుసంధానం చేస్తామని అమిత్‌షా తెలిపారు. ఇకపై పుట్టిన వెంటనే జాబితాలో నమోదు చేయనున్నారు. అలాగే ఎవరైనా మరణించిన వెంటనే వారి పేరును జాబితా నుంచి తొలగించనున్నారు. 18 ఏళ్లు నిండిన తర్వాత, ఓటర్ల జాబితాలో పేరు కూడా చేరనుంది.

ఈ విధానం త్వరలో అమలు కానుందని కేంద్ర హో మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు వెల్లడించారు. పేరు, చిరునామా మార్పు సజావుగా ఉంటుందన్నారు. దీని కోసం అన్నీ అనుసంధానం కానున్నాయి. 2024 నాటికి ఇది అమలులోకి వస్తుందని అమిత్ షా వెల్లడించారు. జనాభా గణాంకాల డిజిటలైజేషన్‌ త్వరలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ ప్రక్రియను రానున్న జన గణనలో అమలు చేస్తామన్నారు. జనన, మరణాల నమోదును జనాభా లెక్కలతో అనుసంధానం చేస్తామని చెప్పారు.

Census Operations Amit Shah Announces Digitisation Of Census, To Be Linked With Birth, Death Register (1)

Census Operations Amit Shah Announces Digitisation Of Census, To Be Linked With Birth, Death Register

దేశాభివృద్ధికి మెరుగైన ప్రణాళిక కోసం సరైన జన గణన ఎంతో అవసరమని అన్నారు అమిత్ షా. తదుపరి జనాభా లెక్కలు ఈ-సెన్సస్ అని తెలిపారు. వంద శాతం ఖచ్చితమైన జనాభా గణన జరుగుతుందన్నారు. రాబోయే 25 ఏళ్లకు సంబంధించిన దేశ అభివృద్ధి ప్రణాళిక జరుగుతుందన్నారు. జనగణన ఎంతో ముఖ్యమన్నారు. జనాభా సున్నితత్వం అసోం వంటి రాష్ట్రాలకు చాలా ముఖ్యమన్నారు. అసోం రాజధాని గౌహతిలో జనాభా లెక్కల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పుట్టిన వెంటనే వాళ్ల వివరాలు జనాభా లెక్కల సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్‌ అవుతాయని అమిత్ షా చెప్పారు. 18 ఏళ్లు నిండిన వాళ్లందరికి ఆటోమెటిక్‌గా ఓటర్‌కార్డులు అందుతాయన్నారు.

Read Also : Amit Shah: నా వాయిస్ హై పిచ్ లో ఉంటుంది..తప్పుగా అనుకోవద్దు..అది మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ ..