Center Government : పంటల మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం

పంటల మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్వింటాల్‌ గోధుమలపై రూ.40, బార్లీపై రూ.35 పెంచింది. టెక్స్‌టైల్‌ పరిశ్రమ కోసం ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్ ప్రకటించింది.

Center Government : పంటల మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం

Crop

support price of crops : పంటల మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్వింటాల్‌ గోధుమల మద్దతు 40 రూపాయలు, బార్లీపై రూ.35 పెంచింది. ఇక టెక్స్‌టైల్‌ పరిశ్రమ కోసం ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్‌ ప్రకటించింది. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

దానిలో భాగంగా ఈ ఏడాదిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయనున్న గోధుమ మద్దతు ధరను 2 శాతం రూ.40 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ ఏడాది క్వింటాల్‌ గోధుమ కనీస మద్దతు ధరను 2,015 రూపాయలుగా నిర్ణయించింది.

రబీ, ఖరీఫ్‌ సంబంధించి 23 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తూ కేంద్ర కేబినెంట్‌ నిర్ణయం తీసుకుంది. బార్లీపై రూ.35 పెంచింది. క్వింటాల్‌ బార్లీ మద్దతు ధర 1,635 రూపాయలుగా నిర్ణయించింది. క్వింటాల్‌ చెరకుకు మద్దతు ధరను 290 రూపాయలుగా నిర్ణయించింది. ఆవాలకు అత్యధికంగా మద్దతు ధర 400 రూపాయలు పెంచింది. క్వింటాల్‌ ఆవాల ధర 5,050 రూపాయలుగా ప్రకటించింది.

కేంద్ర కేబినెట్ -టెక్స్‌టైల్ రంగంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహ‌క స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద అయిదేళ్ల పాటు టెక్స్‌టైల్స్ రంగానికి 10వేల 683 కోట్లు ప్రోత్సహకాల రూపంలో ఇవ్వనున్నారు. పీఎల్ఐ స్కీమ్ ద్వారా అద‌నంగా ఏడున్నర ల‌క్షల ఉద్యోగాల‌ను క్రియేట్ చేయ‌నున్నారు.

పీఎల్ఐ స్కీమ్‌తో గుజ‌రాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, పంజాబ్‌, ఏపీ, తెలంగాణ‌, ఒడిశా లాంటి రాష్ట్రాల‌కు పాజిటివ్ ప్రభావం ఉంటుంద‌ని కేంద్ర టెక్స్‌టైల్ శాఖ‌ మంత్రి గోయ‌ల్ తెలిపారు. ఈ స్కీమ్‌ను ఇత‌ర రాష్ట్రాలు కూడా అడ్వాంటేజ్ తీసుకోవ‌చ్చు అన్నారు. ఈ స్కీమ్‌తో భార‌తీయ కంపెనీలు గ్లోబ‌ల్ సంస్థలుగా ఎదుగుతాయ‌న్నారు.