Real KGF : 121 ఏళ్ల చరిత్ర ఉన్న కర్ణాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌..20 ఏళ్ల క్రితం తవ్వకాలు ఎందుకు నిలిపేశారు? ఇప్పుడు కేజీఎఫ్‌ గేట్లు మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

జీఎఫ్‌ ఓ సినిమా మాత్రమే కాదు..ఇది రియల్ కేజీఎఫ్. ఈ కేజీఎఫ్ కు 121ఏళ్ల చరిత్ర ఉంది. కేజీఎఫ్ అంటే ఓ సినిమాగా మాత్రమే అనుకునేవారికి ఈ రియల్ కేజీఎఫ్ చరిత్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మైన్స్ నుంచి బ్రిటీష్ వారు తరలించుకుపోయిన బంగారం విలువ తెలిస్తే షాక్ అవుతారు. అటువంటి కేజీఎఫ్ లో తవ్వకాలు జరపాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 20 ఏళ్ల కిందట తవ్వకాలు ఎందుకు నిలిపేశారు? ఇప్పుడు ఏ టెక్నాలజీని నమ్ముకొని.. కేజీఎఫ్‌ గేట్లని మళ్లీ తెరుస్తున్నారు? రాబోయే రోజుల్లో కేజీఎఫ్‌లో ఏం జరగబోతోంది?

Real KGF : 121 ఏళ్ల చరిత్ర ఉన్న కర్ణాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌..20 ఏళ్ల క్రితం తవ్వకాలు ఎందుకు నిలిపేశారు? ఇప్పుడు కేజీఎఫ్‌ గేట్లు మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

Real KGF reopen In Karnataka

Real  Kolar Gold Fields In karnataka : కేజీఎఫ్‌ ఓ సినిమా మాత్రమే కాదు..ఇది రియల్ కేజీఎఫ్. ఈ కేజీఎఫ్ కు 121ఏళ్ల చరిత్ర ఉంది. కేజీఎఫ్ అంటే ఓ సినిమాగా మాత్రమే అనుకునేవారికి ఈ రియల్ కేజీఎఫ్ చరిత్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మైన్స్ నుంచి బ్రిటీష్ వారు తరలించుకుపోయిన బంగారం విలువ తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పటికే ఈ మైన్స్ లో బ్రిటీష్ పాలకు అత్యంత భారీగా బంగారాన్ని తరలించుకుపోయారు. అటువంటి కేజీఎఫ్ లో తవ్వకాలు జరపాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలో ఉన్న కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ( KGF)లో మొత్తం తవ్వేసిన కేజీఎఫ్‌లో.. ఇప్పుడు తవ్వితే బంగారం దొరుకుతుందా? ఆ ప్రాంతంలో.. నిజంగానే బంగారం ఉంటే.. 20 ఏళ్ల కిందట తవ్వకాలు ఎందుకు నిలిపేశారు? ఇప్పుడు ఏ టెక్నాలజీని నమ్ముకొని.. కేజీఎఫ్‌ గేట్లని మళ్లీ తెరుస్తున్నారు? రాబోయే రోజుల్లో కేజీఎఫ్‌లో ఏం జరగబోతోంది?

కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌కి.. 121 ఏళ్ల చరిత్ర ఉంది. అక్కడ గోల్డ్ మైనింగ్ నిలిపివేయడంతో.. ఆ ప్రాంతం 20 ఏళ్లుగా నిర్మానుష్యంగా మారిపోయింది. మళ్లీ.. ఇన్నాళ్లకు కేజీఎఫ్ గేట్లు తెరచుకోబోతున్నాయ్. కర్ణాటక క్యాపిటల్ బెంగళూరుకు.. దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో కేజీఎఫ్‌ గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఇక్కడ.. మళ్లీ బంగారం వెలికితీసేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా.. 50 టన్నుల శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారం వెలికితీయాలని చూస్తున్నారు. ఇందుకోసం.. బిడ్లను ఆహ్వానించేందుకు కూడా సర్కార్ రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న కేజీఎఫ్‌లో.. లక్షా 73 వేల కోట్ల విలువైన బంగారం నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Real KGF : రియల్ ‘కేజీఎఫ్’: 20 ఏళ్ల క్రితం మూతపడిన కర్ణాటక కోలార్ గోల్డ్ మైన్స్‌పై కేంద్రం ఫోకస్..తవ్వకాలు జరపాలని సంచలనాత్మక నిర్ణయం

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో.. గతంలోనే శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారం వెలికి తీయాలని చూస్తున్నారు. అంతేకాదు.. బంగారంతో పాటు పల్లాడియంను కూడా బయటకు తీసే ఆలోచనలో ఉన్నారు. అయితే.. ఇప్పటికే శుద్ధి చేసిన ఖనిజంలో బంగారం నిల్వలను ఎలా గుర్తించాలి? దాని నుంచి బంగారాన్ని ఎలా వేరు చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టారు. అయితే.. శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారం వెలికితీసే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ విదేశాల్లో ఉంది. ఇందుకోసం.. ఫారిన్ సంస్థలతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం గానీ.. కన్సార్షియం ఏర్పాటు చేసుకొని.. బంగారాన్ని వెలికి తీయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే.. కేజీఎఫ్‌ నుంచి తవ్వితీసిన మట్టి గుట్టలు, గుట్టలుగా ఉంది. వీటిలో.. టన్నుల్లో బంగారం నిల్వలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం.. రాబోయే నాలుగైదు నెలల్లోనే.. బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉంది.

దక్షిణ కోలార్ జిల్లా హెడ్ క్వార్టర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రాబర్ట్‌ సన్‌ పేట తాలూకాలో ఈ బంగారు గనులున్నాయి. టన్నుల కొద్దీ బంగారానికి కేరాఫ్‌ అయిన కేజీఎఫ్‌కి.. శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. 1804 నుంచి 1860 మధ్యలో కోలార్ ప్రాంతంలో బ్రిటీషర్లు ఎన్నో పరిశోధనలు, సర్వేలు చేశారు. కానీ.. వాళ్లకు అక్కడేమీ దొరకలేదు. ఆ తర్వాతే కేజీఎఫ్‌ అసలు కథ ఆరంభమైంది. 1871లో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వచ్చిన మైకేల్ ఫిట్జ్ గెరాల్డ్ లావిల్ అనే బ్రిటీష్ సైనికుడు వారెన్ రిపోర్ట్ చదివి.. కేజీఎఫ్‌లో కచ్చితంగా బంగారం ఉంటుందన్న నమ్మకంతో రెండేళ్ల పాటు పరిశోధనలు చేశాడు. 1873లో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపేందుకు అనుమతించాలని మైసూర్ మహారాజును కోరాడు. కోలార్ ప్రాంతంలో 20 ఏళ్లపాటు తవ్వకాలకు లావిల్‌ లైసెన్స్ పొందాడు. సరిగ్గా 1875లో తవ్వకాలు మొదలయ్యాయి. కేజీఎఫ్ గనుల్లో మొదట వెలుగు కోసం కాగడాలు, కిరోసిన్ లాంతర్లు ఉపయోగించేవారు. కానీ.. బంగారం తవ్వకాలకు ఆ వెలుతురు సరిపోయేది కాదు. దీంతో అక్కడ కరెంట్ లైట్లు వేయాలని నిర్ణయించారు. అలా కేజీఎఫ్ భారత్‌లో విద్యుత్ పొందిన మొదటి ప్రాంతంగా నిలిచింది. విద్యుత్ సరఫరా రాగానే, కేజీఎఫ్‌లో బంగారం తవ్వకాలు ఊపందుకున్నాయి. మరింత వేగంగా తవ్వకాలు జరిపేందుకు వీలుగా యంత్రాలను గనుల్లోకి దింపారు.

1930ల్లో.. కేజీఎఫ్‌లో 30 వేల మంది పనిచేసేవారు. కూలీల కుటుంబాలు కూడా గనుల చుట్టుపక్కలే నివసించేవి. అయితే.. దేశానికి స్వాతంత్రం రాగానే భారత ప్రభుత్వం కేజీఎఫ్‌ను స్వాధీనం చేసుకుంది. దాదాపు దశాబ్దం తర్వాత అక్కడి బంగారం గనులను జాతీయం చేసింది. భారత్‌కే బంగారు గనిగా కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నిలిచాయి. దేశ బంగారు భవిష్యత్తుకు కేజీఎఫ్‌ బాటలు వేస్తుందని అంతా ఆశించారు. 1970లో ప్రభుత్వ సంస్థ అయిన భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఈ గనుల్లో తవ్వకాలు ప్రారంభించింది. మొదట్లో.. తవ్వేకొద్ది బంగారం బయటపడుతూనే ఉండేది. కానీ.. రోజులు మారేకొద్దీ పరిస్థితులూ మారాయ్. బంగారం వెలికితీతకు అయ్యే ఖర్చు ఎక్కువై.. 2001లో కోలార్‌ గోల్డ్ ఫీల్డ్స్‌ని మూసివేయాల్సి వచ్చింది.

121 ఏళ్లలో దాదాపు 900 టన్నుల దాకా కేజీఎఫ్‌లో బంగారం తవ్వి తీశారంటే.. అక్కడ ఏ స్థాయిలో బంగారం నిక్షిప్తమై ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే.. బంగారం కంటే విలువైన పల్లాడియం నిక్షేపాలు కూడా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. మళ్లీ తవ్వకాల దిశగా కేంద్ర అడుగులేస్తోంది. ప్రపంచంలో చైనా తర్వాత ఇండియానే అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. గోల్డ్ డిమాండ్‌లోనూ, దిగుమతిలోనూ మనమే ముందు వరుసలో ఉన్నాం. అందువల్ల.. మన బంగారాన్ని వదిలేసి ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకోవడమేంటని ఆలోచించిన కేంద్రం.. ఎప్పుడో మూతబడిన కేజీఎఫ్‌ నుంచి.. మళ్లీ బంగారాన్ని తీసేందుకు రెడీ అవుతోంది. గోల్డ్‌తో పాటు పల్లాడియం లోహ నిక్షేపాలు కూడా వెలికి తీసే పనిలో పడింది.