Petrol Rate : పెట్రోల్ ధరలకు కళ్లెం.. రూ.60కే లీటర్ తెచ్చేందుకు మోదీ ప్లాన్స్

ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్ ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. దీపావళి సందర్బంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి.

Petrol Rate : పెట్రోల్ ధరలకు కళ్లెం.. రూ.60కే లీటర్ తెచ్చేందుకు మోదీ ప్లాన్స్

Modi Petrol

Petrol Rate :  ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్ ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. దీపావళి సందర్బంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి. కేంద్రం నిర్ణయంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ధరలను తగ్గించాయి. దీంతో నవంబర్ 1 తేదీకి నేటికీ పెట్రోల్ పై 10 నుంచి 12 రూపాయలు తగ్గగా.. డీజిల్ పై 14 నుంచి 17 రూపాయాల వరకు తగ్గింది.

ఇక మిగతా రాష్ట్రాలు పెట్రోల్ ధరలను తగ్గించేందుకు ముందుకు రాకపోవడంతో పెట్రోల్‌పై కేంద్ర తగ్గింపు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇంధన ధరలను ఇంకా తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం చూస్తే.. లీటరు పెట్రోల్ రూ.60కే లభించొచ్చు. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం ఇథనాల్ బ్లెండింగ్‌ను పెంచాలని చూస్తోంది.

చదవండి : Petrol Rate : ఇంధన ధరల తగ్గింపు.. ఖజానాపై రూ. 45,000 కోట్ల భారం!

దీని ద్వారా దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ తీసుకురావాలని భావిస్తోంది. దీంతో వాహనదారులకు ఊరట కలుగనుంది. పెట్రోల్ ధర రూ.60కు తగ్గొచ్చు. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ డ్రాఫ్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్లన తయారు చేయాల్సి ఉంటుంది. వీటి తయారికి ఎలక్ట్రిక్ వాహనాల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ఇంజిన్లను ఇథనాల్, మిథనాల్, గ్యాసోలిన్ వంటి మిక్సింగ్ చేసిన ఫ్యూయెల్స్ కూడా ఉపయోగించొచ్చు. ఇదే జరిగితే త్వరలో పెట్రోల్ ధర రూ.60 దిగిరానుంది.

చదవండి : Petrol – Diesel: పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.12వరకూ తగ్గించిన యూపీ ప్రభుత్వం

 

ఇక దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని పెట్రోల్ డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే..

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.97గా ఉండగా లీటర్ డీజిల్ రూ.86.67గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.40గా ఉండగా డీజిల్ రూ. 91.43గా ఉంది.
కోల్‌‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67గా ఉండగా డీజిల్ రూ. 89.67గా ఉంది.
వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.109.67గా ఉండగా డీజిల్ రూ. 94.14గా ఉంది.
ఉత్తర ప్రదేశ్ లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.28 ఉండగా డీజిల్ ధర రూ. 86.80గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉండగా లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.49గా ఉండగా లీటర్ డీజిల్ రూ.94.88గా ఉంది.
విజయవాడ‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.96గా ఉండగా లీటర్ డీజిల్ రూ.96.98గా ఉంది.
విశాఖ‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా లీటర్ డీజిల్ రూ.95.18గా ఉంది