Indian Vaccination : 100 శాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రానిదే : మోదీ

భారతదేశంలో వందశాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాల చేతుల్లో ఉన్న 25 శాతం బాధ్యత కూడా కేంద్రమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

Indian Vaccination : 100 శాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రానిదే : మోదీ

Center to take Responsibility 100 Percent of Vaccination, says PM Modi

100% of Vaccination : దేశంలో వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశం నలుమూలల నుంచి వస్తున్న విమర్శలకు ప్రధాని చెక్ పెట్టారు. భారతదేశంలో వందశాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాల చేతుల్లో ఉన్న 25 శాతం బాధ్యత కూడా కేంద్రమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపాదికన వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. జూన్ 21 నుంచి 18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు తక్కువగా ఉన్నాయని అన్నారు.

స్వదేశీ సంస్థల టీకా ఉత్పత్తితో మన సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. వ్యాక్సిన్ పై రాష్ట్రాలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని చెప్పారు. వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రాలకు కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని మోదీ స్పష్టం చేశారు.

75 శాతం వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు సరఫరా చేస్తుందన్నారు. 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో డోసుకు రూ.150 సర్వీసు చార్జ్ తీసుకోవాలన్నారు. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ను దివాళీ వరకు అందిస్తామని చెప్పారు.

అందరూ వ్యాక్సిన్ తీసుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా నియమాలను కచ్చితంగా అందరూ పాటించాలని మోదీ సూచించారు. దేశ ప్రజలందరికి కేంద్రమే వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుందని చెప్పారు.