Six Airbags In Car: ప్రయాణీకుల భద్రత దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం.. కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి .. ఎప్పటి నుంచి అంటే?

2023 అక్టోబర్ 1 నుండి ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వేరియంట్స్, కార్ల ధరలతో సంబంధం లేకుండా ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా వుండాలని తేల్చిచెప్పింది.

Six Airbags In Car: ప్రయాణీకుల భద్రత దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం.. కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి .. ఎప్పటి నుంచి అంటే?

Aribags in cars

Six Airbags In Car: 2023 అక్టోబర్ 1 నుండి ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వేరియంట్స్, కార్ల ధరలతో సంబంధం లేకుండా ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా వుండాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. భారతదేశంలో కారు ప్రయాణాన్ని సురక్షితంగా మార్చే దిశగా ఇదొక ముందడుగు అని గడ్కరీ ట్విటర్ లో పేర్కొన్నారు.

CM KCR: జాతీయ పార్టీ ఏర్పాట్లలో వేగం పెంచిన సీఎం కేసీఆర్.. రేపు యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2020లో హైవేలపై మొత్తం 1.16 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఇందులో 47,984 మంది మరణించారు. ప్రతీయేటా దేశంలో ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాల నివారణకు, ప్రయాణికుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కార్లలో ప్రయాణించే క్రమంలో డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి చేస్తూ జూలై 2019 నుండి అమలు చేయబడింది. అయితే జనవరి 2022 నుండి ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకులకూ ఏయిర్ బ్యాగ్ తప్పనిసరి చేసింది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడం, పక్కపక్కనే ఢీకొనడం వంటి సమయాల్లో ప్రయాణీకులను సురక్షితంగా ఉంచేందుకు వాహనాల్లో మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసింది కేంద్ర రవాణా శాఖ. వెనుక సీట్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం వల్ల ప్రయాణికులందరికీ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అక్టోబర్ 1 నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులను ( నాలుగు సీట్లతో సహా రెండు సైడ్ ఎయిర్ బ్యాగ్ లు) ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ప్రారంభ నెలలో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. కానీ.. సరఫరాలో పరిమితులతో ఆటో ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న ఇబ్బందులు, స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని ప్రయాణీకుల కార్లలో కనీసం ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేసే ప్రతిపాదనను 2023 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు గడ్కరీ తెలిపారు.